Mon Dec 23 2024 08:32:50 GMT+0000 (Coordinated Universal Time)
"ది ఘోస్ట్" రిలీజ్ ట్రైలర్.. నాగార్జున యాక్షన్ అదుర్స్ !
ట్రైలర్ అంతా యాక్షన్ డ్రామా గా కనిపించింది. నాగార్జున ఓ పాపను శతృవుల బారీ నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తుంటాడు.
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన సినిమా ది ఘోస్ట్. సోనాల్ చౌహాన్ కథానాయికగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో సినిమా టీమ్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ , ట్రైలర్, పాటలు విడుదలవ్వగా.. తాజాగా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు.
ట్రైలర్ అంతా యాక్షన్ డ్రామా గా కనిపించింది. నాగార్జున ఓ పాపను శతృవుల బారీ నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ ట్రైలర్ లో నాగార్జున చెప్పిన "డబ్బు, సత్సెస్.. సంతోషం కంటే శతృవులను ఎక్కువ సంపాదిస్తుంది" అనే డైలాగ్ అందరినీ మెప్పిస్తోంది. ఇంటర్ పోల్ అధికారులుగా ఉన్న హీరో, హీరోయిన్ తమ ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారా ? ఆఖరికి ఏం జరిగింది ? అన్నది తెలియాలంటే సినిమాను తెరపై చూడాల్సిందే.
Next Story