Sun Dec 22 2024 19:14:26 GMT+0000 (Coordinated Universal Time)
రాధేశ్యామ్ కొత్త ట్రైలర్ కు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
సంక్రాంతికి సినిమా విడుదల చేసే ప్లాన్ లో ఉండగా.. ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. దానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు..
హైదరాబాద్ : బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా హీరో గా ఎదిగిన ప్రభాస్, టాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే జంటగా.. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన పీరియాడిక్ రొమాంటిక్ ప్రేమకథా చిత్రం రాధేశ్యామ్. ఎన్నోవాయిదాల తర్వాత మార్చి 11న ఈ సినిమా థియేటర్లలో విడుదలవ్వనుంది. సినిమా రిలీజ్ కు ఇంకా రెండువారాలే ఉండటంతో.. మేకర్స్ ప్రమోషన్ల వేగాన్ని పెంచుతున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి 'ఈ రాతలే' వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఒకపక్క మెట్రో ట్రైన్స్ పై, థియేటర్ల వద్ద జ్యోతిషులతో కౌంటర్లు పెట్టించి డిఫరెంట్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. మరోపక్క సోషల్ మీడియాలో సైతం సినిమా నుంచి రోజుకో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అంచనాలను పెంచేస్తున్నారు.
Also Read : రూ.100 కోట్ల క్లబ్ లోకి "వాలిమై"
సంక్రాంతికి సినిమా విడుదల చేసే ప్లాన్ లో ఉండగా.. ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. దానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు రెండో ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. మార్చి 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా మరో కొత్త పోస్టర్ ని కూడా రివీల్ చేశారు. విధికి, ప్రేమకు మధ్య భయంకర యుద్దానికి సాక్ష్యంగా ఈ సినిమా నిలవనునుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో.. ప్రభాస్ నాన్ బాహుబలి రికార్డులు సృష్టిస్తాడా ? బాహుబలిని మించిన రికార్డులు సృష్టిస్తాడా ? చూడాలంటే మార్చి 11 వరకూ ఆగాల్సిందే.
Next Story