Fri Dec 20 2024 17:38:22 GMT+0000 (Coordinated Universal Time)
సలార్ సినిమాకు వెళ్లే ముందు ఇది గుర్తుపెట్టుకోండి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. డిసెంబర్ 22న థియేటర్స్‌లో విడుదలైంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే!! అయితే సినిమాకు వెళ్ళినవాళ్ళలో 18 ఏళ్ల కంటే చిన్న వాళ్ళు ఉంటే అసలు లోనికి రావడం లేదు. గుంటూరు నాజ్ సెంటర్లోని పీవీఆర్ థియేటర్స్ యాజమాన్యం 18 ఏళ్లు నిండని వారిని లోపలికి అనుమతించకుండా థియేటర్ బయటకు పంపేశారు. అలా బయటకు వచ్చిన వాళ్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు థియేటర్ యాజమాన్యంకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళింది. వారం రోజుల్లో రీఫండ్ చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.
మొదటి రోజు దాదాపు 180 కోట్లు కలెక్షన్స్ సాధించింది సలార్. సలార్ సినిమా రెండో రోజు 145-150 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా సలార్ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ ని రిపీట్ మోడ్ లో థియేటర్స్ కి రప్పిస్తున్నాయి.
Next Story