Mon Dec 23 2024 19:15:38 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్జీవీకి ఊహించని షాక్
అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషించిన డేంజరస్ సినిమాకు A సర్టిఫికేట్ వచ్చింది. లెస్బియన్ నేపథ్యంలో..
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఊహించని షాక్ తగిలింది. ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన డేంజరస్ సినిమా ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. క్రైమ్ థ్రిల్లర్-డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమను చూపించాడు ఆర్జీవీ. ఖత్రా అనేది సెక్షన్ 377 రద్దు తర్వాత ఇద్దరు మహిళల మధ్య సాగే ప్రేమకథ. ఈ నేపథ్యంలో ఆర్జీవీకి ఊహించని షాక్ తగిలింది.
అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషించిన డేంజరస్ సినిమాకు A సర్టిఫికేట్ వచ్చింది. లెస్బియన్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో.. కొన్ని థియేటర్లు ఈ సినిమాను ప్రదర్శించేందుకు నిరాకరించాయి. ఈ విషయాన్ని వర్మే స్వయంగా వెల్లడించడం గమనార్హం. పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ నా సినిమాను ప్రదర్శించేందుకు నిరాకరించారు. సుప్రీంకోర్టు సెక్షన్ 377ని రద్దు చేసింది. సెన్సార్ బోర్డు ఆమోదించిన తర్వాత ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. నేను, #LGBT కమ్యూనిటీ మాత్రమే కాకుండా @_PVRcinemas, @INOXCINEMAS నిర్వహణకు వ్యతిరేకంగా నిలబడాలని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. ఇది మానవ హక్కులను అవమానించడమే అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Next Story