Sun Dec 22 2024 08:56:27 GMT+0000 (Coordinated Universal Time)
జనవరి 14నే రాథేశ్యామ్.. కన్ఫర్మ్ చేసిన చిత్రయూనిట్ !
రాధేశ్యామ్ విడుదల కూడా వాయిదాపడుతుందన్న పుకార్లు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో.. మేకర్స్ సినిమా విడుదల పై స్పందించారు. రాధేశ్యామ్ రిలీజ్
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ ప్రభావం రోజురోజుకూ ఎక్కువవుతోంది. వ్యాప్తి వేగంగా ఉండటంతో.. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో థియేటర్లపై మళ్లీ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాను మేకర్స్ వాయిదా వేయగా.. రాధేశ్యామ్ కూడా అదే బాటలో వెళ్తుందన్న పుకార్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : మెడికల్ కాలేజీలో 87 మందికి కోవిడ్ పాజిటివ్ !
రాధేశ్యామ్ విడుదల కూడా వాయిదాపడుతుందన్న పుకార్లు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో.. మేకర్స్ సినిమా విడుదల పై స్పందించారు. రాధేశ్యామ్ రిలీజ్ ప్లాన్స్ లో ఇప్పటివరకూ ఎలాంటి మార్పు లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. జనవరి 14వ తేదీనే రాధేశ్యామ్ విడుదలయ్యేందుకు సిద్ధమవుతోందని, విడుదల వాయిదా పడిందన్న రూమర్లను నమ్మొద్దని ట్విట్టర్ వేదికగా చిత్రయూనిట్ వెల్లడించింది. రాధేశ్యామ్ విడుదలపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story