Mon Dec 23 2024 07:09:27 GMT+0000 (Coordinated Universal Time)
రెండ్రోజుల్లో "ఖిలాడి" విడుదల.. ప్రమోషన్స్ ఎక్కడ ?
ప్రమోషన్స్ తో సోషల్ మీడియాతో పాటు బయట కూడా దద్దరిల్లిపోవాల్సిందే. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చెప్పనక్కర్లేదు.
స్టార్ హీరో సినిమా.. రెండు మూడు భాషల్లో.. పెద్దమొత్తంలో థియేటర్లలో విడుదలవుతుందంటే, కనీసం వారం పదిరోజుల ముందు నుంచి అయినా హడావిడి ఉంటుంది. ప్రమోషన్స్ తో సోషల్ మీడియాతో పాటు బయట కూడా దద్దరిల్లిపోవాల్సిందే. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చెప్పనక్కర్లేదు. స్పెషల్ గెస్ట్, ఫైనల్ ట్రైలర్ ఇలా చాలా ఉంటాయి. వీటన్నింటి కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు. కానీ.. రవితేజ నటించిన "ఖిలాడి" సినిమా ప్రమోషన్స్ సందడి ఎక్కడా కనిపించడం లేదు.
ఈ నెల 11వ తేదీన సినిమా తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతుందంటూ వార్తలొచ్చాయి. కానీ.. బయటెక్కడా ఆ హడావిడేం కనిపించడం లేదు. ప్రమోషన్స్ సోషల్ మీడియాకే పరిమితమయ్యాయి. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్ డేట్ కూడా ఇంతవరకూ లేదు. అయితే.. వీటన్నింటికీ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కారణమన్న టాక్ వినిపిస్తోంది. "ఖిలాడి" లో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటించగా.. నిన్న సాయంత్రమే సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
News Summary - There is no Outside Promotions for Khiladi Movie
Next Story