Sun Dec 22 2024 15:13:25 GMT+0000 (Coordinated Universal Time)
ఖుషి నుంచి మోస్ట్ అవైటెడ్ సాంగ్ వచ్చేసింది.. విన్నారా
మొదటిపాటలో విజయ్ ప్రేమించడం, రెండో పాటలో ఇద్దరి పెళ్లి, జీవనం చూపించారు. తాజాగా.. రౌడీ అభిమానులు ఎంతగానో..
విజయ్ దేవరకొండ - సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. పవన్ కల్యాణ్ మూవీ టైటిల్ కావడంతో పాటు.. మజిలీ వంటి సినిమా తీసిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. అప్పుడప్పుడూ సినిమా గురించి అప్డేట్స్ ఇస్తూ వస్తున్న ఖుషి టీమ్.. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి.. నా రోజా నువ్వే, ఆరాధ్య పాటలు విడుదలవ్వగా.. రెండు పాటలు యువతను బాగా ఆకట్టుకున్నాయి.
మొదటిపాటలో విజయ్ ప్రేమించడం, రెండో పాటలో ఇద్దరి పెళ్లి, జీవనం చూపించారు. తాజాగా.. రౌడీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సాంగ్ "ఖుషీ నువుకనపడితే" పాటను విడుదల చేశారు మేకర్స్. సినిమా ఫస్ట్ పోస్టర్ నుంచి ఈ పాటలో లైన్ బాగా ఆకట్టుకుంది. ఈ పాటలో కూడా విజయ్-సమంతల పెళ్లిని చూపించారు. ఈ పాటకు కూడా దర్శకుడు శివ నిర్వాణ లిరిక్స్ రాయగా.. సంగీత దర్శకుడు హిషామ్ అబ్దుల్ వాహబ్ పాటను ఆలపించారు. కశ్మీర్ నేపథ్యంలో సాగే విభిన్నమైన ప్రేమ కథగా సాగే ఈ సినిమాలో సమంత ఒక ముస్లిం యువతిగా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తికాగా.. సమంత కొన్నాళ్లపాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 1న ఖుషి సినిమా పాన్ ఇండియా వైడ్ గా నాలుగు భాషల్లో థియేటర్లలో విడుదలయ్యేందుకు రెడీ అవుతుంది. ఆ మోస్ట్ అవైటెడ్ సాంగ్ ను మీరూ ఓసారి వినేయండి మరి.
Next Story