Mon Dec 23 2024 02:47:57 GMT+0000 (Coordinated Universal Time)
రంగబలి, భాగ్ సాలే.. సినిమాలు వచ్చేశాయి
నాగశౌర్య, యుక్తి తరేజా హీరోహీరోయిన్లుగా నటించిన ‘రంగబలి’ సినిమా
నాగశౌర్య, యుక్తి తరేజా హీరోహీరోయిన్లుగా నటించిన ‘రంగబలి’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జులై 17న ప్రేక్షకుల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగున్నా సెకండాఫ్ ఆకట్టుకోలేకపోయిందనే కామెంట్స్ వినిపించాయి. రొటీన్ కమర్షియల్ సెకండాఫ్ అని విమర్శలు వచ్చాయి. ఇక ‘రంగబలి’లో సత్య చేసిన కామెడీ ప్లస్ గా నిలిచింది. పవన్ బసమెట్టి ‘రంగబలి’ చిత్రంతో డైరెక్టర్గా ముందుకు వచ్చాడు. నెల రోజులు కూడా కాకుండానే ‘రంగబలి’ ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్ట్ 4న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది.
ఎం.ఎం. కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన సినిమా 'భాగ్ సాలే'. ప్రణీత్ సాయి దర్శకత్వంలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా పతాకాలపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫుల్ ఫన్, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా.
Next Story