Mon Dec 23 2024 17:26:51 GMT+0000 (Coordinated Universal Time)
అంత్యక్రియలు లేట్ అవుతాయా?
సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని చివరి సారి చూసేందుకు వేలాది మంది జనం పద్మాలయా స్టూడియోస్ కు చేరుకున్నారు
సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని చివరి సారి చూసేందుకు వేలాది మంది జనం పద్మాలయా స్టూడియోస్ కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణ అంతిమయాత్ర ప్రారంభమవుతుందని భావించారు. కానీ వేలాది మంది అభిమానులు పద్మాలయా స్టూడియోస్ కు పోటెత్తారు. వారిని కంట్రోల్ చేయడం అక్కడ ఉన్న పోలీసులకు, బౌన్సర్లకూ సాధ్యం కావడం లేదు. దీంతో క్యూలైన్ అతి పెద్దదిగా ఉంది. ఇంకా వేల సంఖ్యలో అభిమానులు సందర్శించుకోవాల్సి ఉంది.
వేల సంఖ్యలో అభిమానులు....
రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి కృష్ణ అభిమానులు చేరుకున్నారు. పద్మాలయ స్టూడియోకి వచ్చిన ప్రతి అభిమానికి కడ చూపు చూసేందుకు అవకాశం కల్పిస్తామని కృష్ణ కుటుంబ సభ్యులు ప్రకటించడంతో అంతిమయాత్ర ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముందు అనుకున్నట్లు మూడు గంటలకు అంత్యక్రియలు జరగడం కష్టంగానే కనిపిస్తుంది. ఇంకా రాజకీయ నేతలు పద్మాలయా స్టూడియోస్ కు వచ్చి కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. దీంతో మరికొంత సమయం పట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Next Story