ఆ మూడు సినిమాలకు 200 కోట్లు బిజినెస్
నిన్న దేశవ్యాప్తంగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వేరువేరు బాషల నుంచి నిన్న మూడు సినిమాలు భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యాయి. అందులో మన తెలుగులో [more]
నిన్న దేశవ్యాప్తంగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వేరువేరు బాషల నుంచి నిన్న మూడు సినిమాలు భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యాయి. అందులో మన తెలుగులో [more]
నిన్న దేశవ్యాప్తంగా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వేరువేరు బాషల నుంచి నిన్న మూడు సినిమాలు భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యాయి. అందులో మన తెలుగులో సైరా. చిరు నటించిన ఈ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్స్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతుంది. ఇక బాలీవుడ్ లో వార్ చిత్రం భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో హృతిక్ – టైగర్ ష్రాఫ్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి కూడా మంచి టాక్ వచ్చింది. ఇక ఈ రెండిటితో పాటు మరో ఇంగ్లీష్ సినిమా జోకర్ రిలీజ్ అయింది. ఈ మూడింటికి పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు రికార్డులు సహా తొలి వీకెండ్ వసూళ్లపైనా ట్రేడ్ పండితులు భారీ అంచనాల్ని వెలువరించారు.
వసూళ్ల పండగ…
ఈ మూడు సినిమాలు కలిపి దేశవ్యాప్తంగా 150 నుంచి 200 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసి ఉంటాయని అంచనా వేస్తోంది ట్రేడ్. సైరా మొదటి రోజు అన్ని భాషల్లో కలుపుకుని సుమారు 50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వార్ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 30కోట్లు వసూలు చేసిందని రమేష్ బాలా వెల్లడించారు. ఇక రిలీజ్ డే రోజు 70శాతం బుకింగ్స్ జరిగాయి. అలానే హాలీవుడ్ మూవీ జోకర్ కి వసూళ్లు మంచి చేస్తుందని చెబుతున్నారు క్రిటిక్ రమేష్ బాలా.