Mon Dec 23 2024 10:53:20 GMT+0000 (Coordinated Universal Time)
పవర్ఫుల్ డైలాగ్ తో టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ గ్లింప్స్
రాజమండ్రి బ్రిడ్జి మీద సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా.. స్టూవర్టుపురం గజదొంగని పాన్..
మాస్ మహారాజా రవితేజ హీరోగా పాన్ ఇండియా మార్కెట్లోకి వస్తోన్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు రియల్ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రవితేజకు సాధారణంగానే మాస్ ఇమేజ్ ఉంది. కానీ ఈ సినిమాలో మున్నుపెన్నడూ కనిపించని రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాలో కనిపించనున్నాడు. వంశీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కాశ్మీర్ ఫైల్స్, కార్త్తికేయ 2 సినిమాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
రాజమండ్రి బ్రిడ్జి మీద సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా.. స్టూవర్టుపురం గజదొంగని పాన్ ఇండియా వైడ్ పరిచయం చేయడానికి 5 బాషల నుంచి 5 హీరోలు వచ్చిన సంగతి తెలిసిందే. హిందీలో జాన్ అబ్రహం, మలయాళంలో దుల్కర్ సల్మాన్, తమిళంలో కార్తీ, కన్నడలో శివ రాజ్ కుమార్, తెలుగులో వెంకటేష్.. టైగర్ నాగేశ్వరరావు గ్లింప్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చి గజదొంగగా రవితేజని పరిచయం చేశారు. తాజాగా ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్.
ఫవర్ఫుల్ డైలాగ్ తో ఈ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ‘జింకలని వేటాడే పులిని చూసుంటావు పులులను వేటాడే పులిని చూశావా’ అన్న డైలాగ్ హైలెట్ గా నిలిచింది. గ్లింప్స్ కు అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. బాలీవుడ్ ముద్దుగుమ్మలు నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్ (Renu Desai) చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తూ రీ ఎంట్రీ ఇస్తుంది. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ టైగర్ నాగేశ్వరరావుకు సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 20న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Next Story