Mon Dec 23 2024 12:53:25 GMT+0000 (Coordinated Universal Time)
గణపథ్, కల్కి ఒకే కథతో రాబోతున్నాయా..?
ప్రభాస్ 'కల్కి', టైగర్ ష్రాఫ్ 'గణపథ్' ఒకే కాన్సెప్ట్ తో రాబోతున్నాయా..?
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). ఈ సినిమా కథ 2898 సంవత్సరంలో జరగబోతుంది. కలియుగాంతంలో ప్రజలు ఇబ్బందులు, కష్టాలు పడుతున్న సమయంలో ఒక హీరో పుట్టుకొస్తాడు. ప్రజల పడుతున్న సమస్యలను ఆ హీరో ఎలా ఎదురుకున్నాడు అనే దానిని సూపర్ హీరో కాన్సెప్ట్ తో కల్కిలో చూపించబోతున్నారు. అయితే ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో ఒక మరో సినిమా కూడా రాబోతుందని తెలుస్తుంది.
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ నటిస్తున్న తాజా చిత్రం 'గణపథ్' (Ganapath). రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా 2070 సంవత్సరంలో జరగబోతుందని టీజర్ లో చూపించారు. ఇక స్టోరీ విషయానికి వస్తే.. 'సమస్యల్లో ఉన్న ప్రజలను భవిష్యత్ టెక్నాలజీని ఉపయోగించి హీరో ఎలా సేవ్ చేశాడు' అనేది సినిమా కథ అని తెలుస్తుంది. గణపథ్ టీజర్ చూస్తుంటే.. కల్కి టీజరే గుర్తుకు వస్తుంది.
ఇక గణపథ్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. కల్కి సినిమా కూడా రెండు భాగాలుగానే రానుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ రెండు సినిమాల మధ్య మరో పోలిక కూడా ఉంది. ఈ రెండు చిత్రాల్లో అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. రెండు మూవీస్ లోని అమితాబ్ పాత్ర హీరోకి సపోర్ట్ చేసేలా ఒక బలమైన పాత్రగా ఉండబోతుందని తెలుస్తుంది.
ఇలా రెండు సినిమాల్లో చాలా దగ్గర పోలికలు కనిపిస్తుండడంతో.. సోషల్ మీడియాలో కొందరు నెటిజెన్స్.. కల్కి అండ్ గణపథ్ సినిమాలను కంపేర్ చేస్తూ పోస్టులు వేస్తున్నారు. మరి ఈ సినిమాలు రెండు ఒకే కథతో రాబోతున్నాయా..? అనేది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా గణపథ్ ఫస్ట్ పార్ట్ 'ఏ హీరో ఈజ్ బోర్న్' మూవీ అక్టోబర్ 20న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. కల్కి సంక్రాంతికి వస్తుందంటూ ప్రకటించినప్పటికీ.. ఆ టైం రావడం లేదని టాక్ వినిపిస్తుంది.
Next Story