Fri Nov 22 2024 21:32:08 GMT+0000 (Coordinated Universal Time)
బాలీవుడ్ సినిమాను కోల్పోయిన రష్మిక.. ట్రైగర్ ష్రాఫ్ సినిమాకు ఆదిలోనే బ్రేక్
స్క్రూ ఢీలా సినిమాలో హీరో పాత్రకోసం టైగర్ ఫ్రాఫ్ రూ.35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఈ మేరకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పై..
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ముఖ్యంగా నార్త్ లో పుష్ప బ్లాక్ బస్టర్ కావడంతో.. రష్మిక క్రేజ్ బాగా పెరిగిపోయింది. బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టైగర్ ష్రాఫ్ ఇప్పటికే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో కరణ్ జొహార్ 'స్క్రూ ఢీలా' అనే చిత్రం నిర్మిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయిందట. అందుకు కారణం ట్రైగర్ ష్రాఫ్ రెమ్యునరేషన్.
స్క్రూ ఢీలా సినిమాలో హీరో పాత్రకోసం టైగర్ ఫ్రాఫ్ రూ.35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఈ మేరకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పై సంతకం కూడా చేశాడు. సినిమా షూటింగ్ మొదలయ్యాక కరణ్ జోహార్ టైగర్ ష్రాఫ్ రెమ్యునరేషన్ ను తగ్గించుకోవాలని కోరాడు. పారితోషికం కింద రూ.20కోట్లు తీసుకుని, లాభాల్లో వాటా తీసుకోవాలని అడిగారట. కానీ టైగర్ ష్రాఫ్ అందుకు ఒప్పుకోలేదు. దాంతో సినిమా ఆగిపోయిందని సమాచారం.
నటీనటుల రెమ్యునరేషన్లతో కలుపుకుని సినిమా నిర్మాణానికి రూ. 140 కోట్ల వరకు ఖర్చవుతోందట. దీనికి సినిమా ప్రచార కార్యక్రమాల ఖర్చు అదనం. టైగర్ ష్రాఫ్ పారితోషికం విషయంలో వచ్చిన తేడా కారణంగా.. రష్మిక బాలీవుడ్ సినిమా కోల్పోయినట్టయింది. అయితే ఇది తాత్కాలికంగా ఆగిపోయిందా ? పారితోషికం విషయాలు క్లియర్ అయితే మళ్లీ షూటింగ్ మొదలవుతుందా ? అన్న విషయాలేవీ తెలియరాలేదు.
Next Story