Sun Dec 22 2024 17:16:53 GMT+0000 (Coordinated Universal Time)
సల్మాన్ ఖాన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!
ఈ సిరీస్ లో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో టైగర్ ఫ్రాంచైజీ పై భారీ అంచనాలు..
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గాయపడ్డాడు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'టైగర్ 3' సినిమాలో నటిస్తూ ఉన్నాడు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పై థ్రిల్లర్ లో ఎన్నో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఈ సిరీస్ లో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో టైగర్ ఫ్రాంచైజీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కూడా హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లో అతనికి భుజానికి గాయం అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో సల్మాన్ షేర్ చేసిన ఫోటోలో భుజంపై కినిసాలజీ టేప్‌తో కనిపించాడు.
"Wen u think u r carrying the weight of the world on your shoulders , he says duniya ko chodo paanch kilo ka dumbbell utha ke dikhao .Tiger Zakhmi Hai . #Tiger3" అంటూ సల్మాన్ ఖాన్ పోస్టు పెట్టాడు. సల్మాన్ ఖాన్ భుజానికి గాయం అయిందని.. 5 కేజీల డంబెల్ కూడా ఎత్తడం కష్టమేనని తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్ ఇటీవలే ద-బాంగ్ రీలోడెడ్ టూర్లో భాగంగా కోల్‌కతాలో ప్రదర్శన ఇచ్చాడు. సోనాక్షి సిన్హా, పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఆయుష్ శర్మ, మనీష్ పాల్, గురు రంధవాతో సహా అనేక మంది స్టార్స్ ఈ టూర్ లో భాగమయ్యారు. కోల్‌కతా అందించిన ప్రేమకు చాలా ధన్యవాదాలని చెప్పాడు సల్మాన్. అంతేకాకుండా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా సల్మాన్ ఖాన్ కలిశాడు.
Next Story