Tue Dec 24 2024 13:31:09 GMT+0000 (Coordinated Universal Time)
రేపు ఏపీలో మార్నింగ్ షో బంద్
సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపంగా ఆంధ్రప్రదేశ్ లో రేపు మార్నింగ్ షోలను బంద్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి
సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాప సూచకంగా చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలు శాఖలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నిర్మాతల మండలి ఎల్లుండి షూటింగ్ లను బంద్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో రేపు మార్నింగ్ షోలను బంద్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. రేపు ఏపీలో మార్నింట్ షోలు వేయకూడదని సినిమా థియేటర్ల యజమానుల సంఘం నిర్ణయించింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించారు. మహేష్ బాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మహేష్ ను ఓదార్చిన చిరంజీవి....
మెగాస్టార్ చిరంజీవి నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసానికి వచ్చి ఆయనకు నివాళులర్పించారు. మహేష్ బాబును ఓదార్చారు. ధైర్యం తెచ్చుకోవాలని కోరారు. రేపు మధ్యాహ్నం 2 గంటల వరకూ కృష్ణ పార్థీవదేహాన్ని గచ్చిబౌలి స్టేడియంలోనే ఉంచుతారు. అభిమానుల సందర్శనం కోసం ఆయన పార్ధీవ దేహాన్ని ఈరోజు సాయంత్రానికి గచ్చిబౌలి స్టేడియానికి తరలిస్తారు. కృష్ణ మృతి పట్ల కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా సంతాపాన్ని ప్రకటించారు.
Next Story