Mon Dec 23 2024 09:10:21 GMT+0000 (Coordinated Universal Time)
మొగల్తూరులో ప్రభాస్... లక్షమందికి భోజనాలు
నేడు మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది వీఐపీలు హాజరవుతున్నారు.
నేడు మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది వీఐపీలు హాజరవుతున్నారు. దీంతో మొగల్తూరు నిన్నటి నుంచే జనంతో కిటకిటలాడిపోతోంది. ప్రభాస్ అభిమానులు వేల సంఖ్యలో మొగల్తూరు చేరుకుంటున్నారు. కృష్ణంరాజు సొంత ఊరు అయిన మొగల్తూరులో ఈరోజు సంస్మరణ ఏర్పాటు చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన అభిమానులు మొగల్తూరుకు నిన్ననే చేరుకున్నారు. కృష్ణంరాజు సొంత ఇంటి వద్ద ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
సంస్మరణ సభకు...
దాదాపు లక్ష మంది ఈ సభకు హాజరవుతారని అంచనా. వచ్చిన వారందరీకి భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణంరాజు మంచి భోజన ప్రియుడు. ఆయన వద్దకు ఎవరు వచ్చినా మంచి భోజనం పెట్టిన తర్వాతనే పంపుతారు. అందుకే యాభై రకాల పదార్థాలతో ఈరోజు వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని సినీనటుడు ప్రభాస్ నిర్ణయించారు. ఆయన కిష్టమైన నాన్ వెజ్ వంటకాలు ఇందులో ఉన్నాయి. కొన్నేళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరుకు రావడంతో ఆయన అభిమానులు చూసేందుకు అభిమానులు పెద్దయెత్తున తరలి వస్తున్నారు. పోలీసులకు వారిని కంట్రోల్ చేయడం కూడా కష్టంగా మారింది. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ భోజనం అందేలా చూడాలని ప్రభాస్ అధిక సంఖ్యలో సిబ్బందిని నియమించారు.
Next Story