Mon Dec 23 2024 14:04:03 GMT+0000 (Coordinated Universal Time)
ఉగ్రం ట్రైలర్.. అల్లరి నరేష్ నుంచి నరేష్ గా మారిన నటవిశ్వరూపం
షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఉగ్రం నుండి ట్రైలర్ ను..
అల్లరి సినిమాతో తనకు గుర్తింపు రావడంతో.. అల్లరి నరేష్ గానే ఉండిపోయాడు హీరో నరేష్. ఇప్పుడు తనపేరుకు ముందున్న ఆ అల్లరిని తీసేసి.. తన నట విశ్వరూపాన్ని ఉగ్రంగా చూపించేందుకు సిద్ధమయ్యాడు. కామెడీ సినిమాలకు గుడ్ బై చెప్పి.. కొంతకాలంగా సీరియస్ కథలను ఎంచుకుంటూ.. హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. నాంది తో మొదలైన మార్పు.. ఇలాగే కంటిన్యూ అవ్వాలని నరేష్ అభిమానులు కోరుకుంటున్నారు.
నాంది సినిమాతో నరేష్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విజయ్ కనకమేడల.. నరేష్ తో తీసిన మరో చిత్రం ఉగ్రం. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఉగ్రం నుండి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ మొదలు నుండి ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమస్యల్లో అతిపెద్ద ప్రధాన సమస్య సెక్స్ రాకెట్. చిన్నపిల్లల నుండి వయసు పైబడి వారి వరకూ అందరినీ కిడ్నాప్ చేసి ఇష్టారాజ్యంగా వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. వారి బతుకులపై వచ్చే ఆదాయంతో మేడలు కట్టుకుని.. దర్జాగా బతుకుతున్నారు బడా వ్యాపారులు. ఈ సినిమా ఆ కోణంలో తీసిందేనని ట్రైలర్ లో చూపించారు.
ఉగ్రంలో నరేష్ శివకమార్ అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. బయటివారితో పాటు తన భార్య, కూతుర్ని కూడా పోగొట్టుకున్న ఓ పోలీస్ ఆఫీసర్ సెక్స్ రాకెట్ మాఫియాతో ఎలా తలపడ్డాడు. వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాడు. కిడ్నాప్ కు గురైనవారందరినీ రక్షించాడా ? అన్న పాయింట్లను ట్రైలర్ లో చూపిస్తూ.. ఆసక్తిని పెంచారు. నరేష్ నట విశ్వరూపాన్ని చూడాలంటే.. మే 5 వరకూ ఆగాల్సిందే. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.
Next Story