Sun Dec 22 2024 18:37:35 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కు గ్రేడ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ !
అప్పుడప్పుడు వెండితెరపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. కొన్నేళ్లుగా పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. నాలుగు నెలల క్రితమే హంసనందినికి
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ హంసనందిని గ్రేడ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. ఈ విషయాన్ని హంస నందినీనే స్వయంగా తెలిపింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకిందని, అది గ్రేడ్ 3లో ఉందని పేర్కొంది. కాగా.. ఈ 37 ఏళ్ల బ్యూటీ ప్రస్తుతం పూణేలో ఉంటోంది. అప్పుడప్పుడు వెండితెరపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. కొన్నేళ్లుగా పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. నాలుగు నెలల క్రితమే హంసనందినికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయింది. కాగా.. ఆమె తల్లి క్యాన్సర్ తోనే మరణించగా.. ఇప్పుడు హంసకు కూడా క్యాన్సర్ అని తేలింది. అంటే హంసకు క్యాన్సర్ రావడం అంటే వంశపారంపర్యంగా ఇది కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా చేసిన క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలలో హంసా నందినికి BRCA1 పాజిటివ్ అని తేలింది. తల్లిని కోల్పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోకుండానే.. తనకూ క్యాన్సర్ ఉందని తెలియడం హంసను మరింత క్షోభకు గురిచేస్తోంది. అయినప్పటికీ క్యాన్సర్ ను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడింది. ప్రస్తుతం హంస క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. తాజాగా అందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో హంస గుండు చేయించుకున్నట్లుగా కనిపిస్తుండగా.. క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Next Story