Mon Dec 23 2024 06:57:40 GMT+0000 (Coordinated Universal Time)
Tollywood : ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఫోటోలు వైరల్..
పరిశ్రమలో కొందరు ఒకటి రెండు సినిమాలో తళుక్కుమని.. ఆ తరువాత మాయమై పోతుంటారు. అలా మాయమైపోయిన ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..?
Tollywood Actress : సినిమా ఇండస్ట్రీలోకి చాలా మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తుంటారు. అయితే కొంతమంది వరుసగా ఆఫర్లు అందుకుంటూ చాలా కాలం స్క్రీన్ పై కనిపిస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలో తళుక్కుమని.. ఆ తరువాత మాయమై పోతుంటారు. అయితే ప్రెజెంట్ సోషల్ మీడియా వాడకం అనేది బాగా ఎక్కువ అవ్వడంతో.. అలా ఒకటి రెండు సినిమాల్లో మెరిసిన తారలు కూడా సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ కి కనిపిస్తూ ఉంటున్నారు.
తాజాగా అలా 2019లో ఒక సినిమాలో కనిపించి మాయమైపోయిన ఒక అమ్మాయి.. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆమెకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజెన్స్.. ఈ అమ్మాయేంటి ఇంతా అందంగా మారిపోయింది..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే ఆమెకు ఛాన్సులు ఇవ్వండి అంటూ టాలీవుడ్ డైరెక్టర్స్ ని ట్యాగ్ చేస్తున్నారు. ఇంతకీ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయిని మీరు గుర్తుపట్టారా..?
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో.. హీరోతో పాటు ఐదు జనరేషన్ లేడీ పాత్రలు ఉంటాయి కదా. ఆ పాత్రల్లో టీనేజ్ అమ్మాయిగా 'స్వాతి' అనే పాత్రని పోషించిన అమ్మాయే ఈ అమ్మాయి. ఈమె అసలు పేరు 'శ్రియ కొంతం'. సినిమాలో కళ్ళజోడు పెట్టుకొని మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపించిన శ్రియ సోషల్ మీడియా పిక్స్ చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
లంగావోణీలో ట్రెడిషనల్ గా కనిపిస్తూనే.. మోడరన్ డ్రెస్ లో హాట్ అందాలతో అదరగొడుతుంది. ప్రస్తుతం శ్రియ పిక్స్ ని షేర్ నెటిజెన్స్ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈమెకు ఆఫర్లు ఇవ్వడం లేదా..? లేదా శ్రియనే సినిమాలకు దూరంగా ఉంటుందా..? అని ప్రశ్నిస్తున్నారు. అసలు విషయం ఏంటనేది ఆమె చెప్పాలి. మీరు శ్రియ ఇన్స్టాగ్రామ్ వైపు ఒక లుక్ వేసేయండి.
Next Story