Mon Dec 23 2024 07:06:53 GMT+0000 (Coordinated Universal Time)
అంకులేంట్రా అంకుల్ ? కేసు పెడతా.. బ్రహ్మాజీ సెటైరికల్ ట్వీట్
ఆంటీని మళ్లీ రెచ్చగొట్టారని ఒకరంటే.. ఎన్ని కేసులు వేస్తానని బెదిరించినా ఆ ఆంటీకి వచ్చినంత పేరు మాత్రం మీకు రాదని..
ప్రముఖ టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ చేసిన ఓ ట్వీట్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్రహ్మాజీ.. ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో టచ్ లో ఉంటారు. తాజాగా వాట్స్ హ్యాపెనింగ్ అని తన సెల్ఫీని పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. అది చూసిన ఓ నెటిజన్.. ఏం లేదు అంకుల్ అని బదులిచ్చాడు. ఆ రిప్లై చూసిన బ్రహ్మాజీ దానిని రీ ట్వీట్ చేస్తూ.. "అంకులేంట్రా అంకుల్. కేసు వేస్తా, బాడీ షేమింగ్ చేస్తున్నావా?" అని స్మైలీ ఎమోజీని జతచేశారు. క్షణాల్లోనే ఆ ట్వీట్ వైరల్ అయింది. ఇంకేముంది.. అభిమానులు సరదా సరదా కామెంట్లతో ట్విట్టర్ ను ఓ ఊపు ఊపేశారు.
ఆంటీని మళ్లీ రెచ్చగొట్టారని ఒకరంటే.. ఎన్ని కేసులు వేస్తానని బెదిరించినా ఆ ఆంటీకి వచ్చినంత పేరు మాత్రం మీకు రాదని ఇంకొకరు.. #SayNotToOnlineAbuse అనే హ్యాష్ట్యాగ్ మర్చిపోయారు అంకుల్' అని మరొకరు కామెంట్ల వర్షం కురిపించారు. కాగా.. ఇటీవల తనను ఆంటీ అని సంబోధించిన నెటిజన్లపై కేసులు పెడతానని హెచ్చరించిన యాంకర్ అనసూయ.. అన్నట్లుగానే రెండ్రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు బ్రహ్మాజీ తనను అంకుల్ అంటే కేసు పెడతానని వేసిన సెటైరికల్ ట్వీట్ పై.. అభిమానులు గుడ్ టైమింగ్ అని పొగిడేస్తున్నారు.
Next Story