Thu Dec 19 2024 15:15:30 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ, జనసేన ఫ్యాన్స్ వార్.. అనసూయ కౌంటర్..
వైసీపీ, జనసేన ఫ్యాన్స్ వార్ లోకి టాలీవుడ్ నటి అనసూయ ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగింది..?
సోషల్ మీడియా అనేది ఎంటర్టైన్మెంట్, సమాచారం, కొత్త అప్డేట్స్ తెలుసుకోవడానికి కంటే ఫ్యాన్ వార్స్ కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ ఫ్యాన్ వార్స్ అనేవి కూడా సినిమా, క్రీడా, పొలిటికల్ రంగం అని తేడా లేకుండా నిత్యం జరుగుతూనే ఉంటున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన ఫ్యాన్స్ వార్ ఎప్పుడు ట్రేండింగ్ లోనే ఉంటుంది. అయితే తాజాగా ఈ ఫ్యాన్ వార్ లోకి టాలీవుడ్ నటి అనసూయ ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగింది..?
ఇటీవల విజయవాడ దివంగత నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్ళికి రాజకీయనాయకులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈక్రమంలోనే వైసీపీ నాయకులు, రాధాకృష్ణ ఆప్తమిత్రులు అయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకి పవన్ కళ్యాణ్ రాగానే.. అతన్ని చూసేందుకు ఫ్యాన్స్ అంతా ముందుకు దూసుకు వచ్చారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితిలో తోపులాట క్రియేట్ అయ్యింది.
ఈ తోపులాటలో అక్కడే ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ కింద పడిపోయే పరిస్థితి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోని జనసేన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీటికి కౌంటర్ ఇస్తూ వైసీపీ ఫ్యాన్స్ కూడా పలు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఒక వైసీపీ అభిమాని.. "అనసూయ, రష్మీ వచ్చినా జనాలు అలాగే ఎగబడతారు" అంటూ కామెంట్స్ చేశాడు.
ఇక ఈ ట్వీట్ అనసూయ వరకు వెళ్ళింది. దీంతో ఆమె రియాక్ట్ అవుతూ ఒక ట్వీట్ చేసింది. "ఇలా అగౌరవంగా మా పేర్లు లాగటం తప్పండి. అవును మమ్మల్ని చూడటానికి జనాలు ఎగబగతారు. ఎందుకంటే మేము సాధించి ఒక స్థాయికి వచ్చాము. అలా సాధించిన వాళ్ళు ఎలా ఉంటారో చూడాలనే ఆసక్తితో ఎగబడతారు. అయితే ఈ స్థాయికి రావడం అనేది.. మీరు మా పేర్లు వాడినంత సులువు కదండీ. కాబట్టి దయచేసి మా జర్నీ గౌరవించండి" అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Next Story