Tue Dec 24 2024 03:47:05 GMT+0000 (Coordinated Universal Time)
నటి ఆరోపణలు.. టాలీవుడ్ కమెడియన్ కు కష్టాలు తప్పవా..?
అమ్మాయిని 'ఐటెమ్' అని పిలిచిన ఓ యువకుడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధించిన వార్త తెలిసిందే..! 25 ఏళ్ల యువకుడు తనను లైంగికంగా వేధించాడంటూ 16 ఏళ్ల బాలిక 2015లో కేసు పెట్టింది. 14 జులై 2015న తాను స్కూలు నుంచి ఇంటికెళ్తున్న సమయంలో యువకుడు తనను బైక్పై వెంబడించాడని, ఆ తర్వాత జుట్టు పట్టుకుని లాగుతూ.. ఏం ఐటెమ్.. ఎక్కడికెళ్తున్నావ్? అని వేధించాడని ఆరోపించింది. విచారణ చేపట్టిన పోక్సో కోర్టు.. అమ్మాయిలను లైంగికంగా వేధించేందుకు అబ్బాయిలు ఉద్దేశపూర్వకంగానే అలా పిలుస్తారని పేర్కొంది. నిందితుడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది.
అయితే ఇప్పుడు టాలీవుడ్ లో కమెడియన్ పై కూడా ఇదే విషయంలో నటి ఆరోపణలు చేస్తోంది. కల్పిక గణేశ్ టాలీవుడ్ యువ కమెడియన్ అభినవ్ గోమటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అభినవ్ గోమటం తనను ఐటెం అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించాడని కల్పిక మండిపడుతోంది. అభినవ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఆమె తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ట్యాగ్ చేస్తూ, అభినవ్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. అభినవ్ గోమటం మాత్రం కల్పిక ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నాడు.
ఇటీవల కల్పికకి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక అవార్డు వచ్చింది. దీనిపై అభినవ్ సెటైర్లు వేస్తూ తనని కించపరిచే విధంగా కామెంట్స్ చేశాడని కల్పిక ఆరోపిస్తోంది. అభినవ్ ఆమెని 'ఐటెం' అంటూ కించపరిచినట్లు తెలుస్తోంది. దీనితో అతడిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వాళ్లకు బుద్ది చెప్పాలని కల్పిక వరుసగా పోస్ట్ లు చేస్తోంది. తనని అసభ్యంగా మాట్లాడిన చాట్స్ ని కూడా షేర్ చేస్తోంది. అభినవ్ తనకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కల్పిక డిమాండ్ చేస్తోంది. కానీ అభినవ్ మాత్రం సారీ చెప్పనని అంటున్నాడు.
Next Story