Mon Dec 23 2024 11:24:53 GMT+0000 (Coordinated Universal Time)
మంచువారమ్మాయినీ వదలని కరోనా.. !
తాజాగా మంచువారమ్మాయి మంచు లక్ష్మి కి కూడా కరోనా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే సోషల్ మీడియా వేదికగా
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఇండస్ట్రీ ఏదైనా.. సెలబ్రిటీలను మాత్రం కరోనా వదలట్లేదు. కొద్దిరోజుల క్రితమే మంచు మనోజ్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా మంచువారమ్మాయి మంచు లక్ష్మి కి కూడా కరోనా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Also Read : మహేష్ బాబుకి కోవిడ్ పాజిటివ్ !
"రెండేళ్ల నుంచి బూచోడు లాంటి కరోనా వైరస్ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాను. కానీ చివరికి దాని చేతికి చిక్కక తప్పలేదు. దానితో పోరాడేందుకు ఎంతో ప్రయత్నించాను. కానీ దానికి వేరే ప్రణాళికలు ఉన్నాయనుకుంటాను. అందుకే నన్ను విడిచిపెట్టలేదు. కరోనాకు చికిత్స తీసుకుంటున్నాను. నాకు ఉన్న కలరీ స్కిల్స్తో దాన్ని ఎలాగైనా దూరంగా పంపిస్తాను" అంటూ మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది. అలాగే కోవిడ్ నుంచి మీరంతా జాగ్రత్తగా ఉండండంటూ అభిమానులకు సూచించింది.
Next Story