Mon Dec 23 2024 18:10:48 GMT+0000 (Coordinated Universal Time)
Santhoshi : అల్లు అర్జున్‌కి హీరోయిన్గా ఛాన్స్ మిస్.. ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టి..
అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న సంతోషి.. ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టి మరి ఏం చేస్తుందో తెలుసా..?
Santhoshi : ఇండస్ట్రీకి చాలామంది నటీనటులు వస్తుంటారు పోతుంటారు. లైమ్ లైట్లో ఉన్నంత కాలం ఆ తారలు గురించి అన్ని విషయాలు తెలుసుకొనే ఆడియన్స్.. అవకాశాలు తగ్గిన తరువాత వాళ్ళు ఏమయ్యారు..? ఇప్పుడు ఏం చేస్తున్నారు..? అనే విషయాలను పెద్దగా పట్టించుకోరు. అలా అందరూ మర్చిపోయిన హీరోయిన్ 'సంతోషి'. విజయవాడ కుటుంబానికి చెందిన సంతోషి.. తమిళనాడులోనే పుట్టి పెరిగారు.
తమిళ చిత్రాలతోనే యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేశారు. 2000 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన సంతోషి.. 2004లో నవదీప్ హీరోగా తెరకెక్కిన 'జై' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా, తమిళంలో నటించిన 'బాల' మూవీ సంతోషికి మంచి గుర్తింపుని సంపాదించి పెట్టాయి. ఇక తెలుగు నటించిన రెండో సినిమా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'తో నంది అవార్డుని అందుకున్నారు. ఈ సినిమాలో పనిమనిషి పాత్రలో సంతోషి కనిపించారు.
పవన్ కళ్యాణ్, రజినీకాంత్ సినిమాల్లో కూడా ముఖ్య పాత్రల్లో సంతోషి కనిపించారు. అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ 'ఆర్య'లో సంతోషినే హీరోయిన్ గా నటించాల్సింది. కానీ అదే సమయంలో 'జై' మూవీ కూడా చేస్తుండడంతో ఆ అవకాశం మిస్ అయ్యింది. పూరీజగన్నాధ్ నుంచి కూడా అవకాశం వచ్చిందట. ఇలా సినిమాల్లో వరుస అవకాశాలు వస్తున్నా.. వెండితెరకు గుడ్ బై చెప్పేసి బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు.
సంతోషి ఇలా చేయడానికి కూడా ఒక కారణం చెప్పుకొచ్చారు. సినిమాల్లో స్కిన్ షోలు, రొమాన్స్ అండ్ బెడ్ రూమ్ సీన్స్ చేయాల్సి ఉంటుంది. అవి చేయడం ఇష్టంలేకే బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారట. సీరియల్స్ లో అయితే అలాంటి సన్నివేశాలు ఉండవని అక్కడ నటిస్తూ వచ్చారు. అంతేకాదు మూవీ అయితే రెండు, మూడు నెలలు మాత్రమే వర్క్ ఉంటుంది. అదే సీరియల్స్ లో ఏడాది పాటు పని ఉంటుంది. సంపాదన ఉంటుందని బుల్లితెరకు వెళ్లారట.
అయితే ఇప్పుడు బుల్లితెరకు కూడా దూరమయ్యారు. తన ఇంటిని కూడా తాకట్టు పెట్టి ఒక బ్యూటీ అండ్ జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశారు. 'ప్లష్' అనే పేరుతో పలు ప్రాంతాల్లో సక్సెస్ఫుల్ గా బ్రాంచ్‌లు నడుపుతూ బిజినెస్ ఉమెన్‌గా బిజీగా ఉన్నారు. ఒకవేళ భవిషత్తులు తన మంచి పాత్రలు అవకాశం వస్తే.. కచ్చితంగా నటిస్తాను అంటూ చెప్పుకొచ్చారు.
ఇక సంతోషి పర్సనల్ విషయానికి వస్తే.. శ్రీకర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ కుర్రాడు అయిన శ్రీకర్ కూడా నటుడే. పలు సీరియల్స్ లో సంతోషితో కలిసి నటించారు.
Next Story