Mon Dec 23 2024 18:21:02 GMT+0000 (Coordinated Universal Time)
Silk Smitha : సిల్క్ స్మిత కొరికిన యాపిల్.. లక్షకు వేలం జరిగిందా..?
సిల్క్ స్మిత కొరికిన యాపిల్ గురించిన కథ మీకు తెలుసా..? ఆ యాపిల్ ఏకంగా 1 లక్షకు అమ్ముడు పోయినట్లు...
Silk Smitha : సిల్క్ స్మిత.. ఈ పేరు తెలియని వారు చాలా తక్కువమంది ఉంటారు. సౌత్ సినీ ప్రపంచాన్ని తన అందంతో ఒక ఊపు ఊపేసిన అందాల తార. ఒకప్పటి సినిమాల్లో ముఖ్య పాత్రలు, ఐటెం నెంబర్ సాంగ్స్ చేసిన సిల్క్ స్మిత.. హీరోయిన్స్ కంటే ఎక్కువ స్టార్‌డమ్‌ని, పాపులారిటీని సంపాదించుకున్నారు. ముఖ్యంగా అబ్బాయిల్లో సిల్క్ కి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. ఈ క్రేజ్ వల్లే.. ఆమె కొరికిన యాపిల్ గురించి ఓ కథ అప్పటిలో సెన్సేషన్ అయ్యింది. ఇంతకీ ఆ కథ ఏంటి..?
1984లో సిల్క్ స్మిత ఓ సినిమా షూటింగ్ బ్రేక్ లో అక్కడ ఉన్న యాపిల్ తీసుకోని ఒక ముక్క కొరికి తిన్నారట. ఇంతలో డైరెక్టర్ షాట్ రెడీ అయ్యిందని పిలవడంతో ఆ యాపిల్ ని అక్కడే పట్టేసి షాట్ చేయడానికి వెళ్లిపోయారు. ఇక ఆ సగం కొరికిన యాపిల్ ని ఆమె మేకప్‌మ్యాన్ వేలం వేసాడట. ఈ వేలంలో ఆ యాపిల్ ని పొందడానికి అభిమానులు భారీ ధరని చెల్లించినట్లు అప్పటిలో కొన్ని వార్తలు వచ్చాయి. కొన్ని రిపోర్టులు ప్రకారం ఆ యాపిల్ రూ.200 వేలం, రూ.26,000 వేలం జరిగినట్లు సమాచారం.
మరికొన్ని రిపోర్టులు ప్రకారం ఆ కొరికిన యాపిల్ ఏకంగా 1 లక్షకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదుగాని అప్పటిలో ఈ వార్త సంచలనం అయ్యింది. ఆ సమయంలో సిల్క్ స్మిత దగ్గరకి ఒక చిన్న మిఠాయి కిళ్ళీ తీసుకు వచ్చి.. దానిని కొంచెం కొరికి ఇవ్వమని తెగ బ్రతిమాలుకునేవారట. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సిల్క్ స్మిత చివరి రోజుల్లో ఆస్పత్రిలో నిర్జీవ స్థితిలో.. తన డెడ్‌బాడీపై వాలుతున్న ఈగలుని తోలడానికి కూడా ఎవరులేని స్థితిలో చనిపోయారు.
1960 డిసెంబర్ 2న జన్మించిన సిల్క్ స్మిత.. 1996లో సెప్టెంబర్ 23న కన్నుమూశారు. ఆమె కథ ఆధారంగా గతంలో బాలీవుడ్ లో ‘ది డర్టీ పిక్చర్’ అనే సినిమా వచ్చింది. సిల్క్ స్మిత పాత్రని విద్యా బాలన్ చేశారు. ఇప్పుడు ఆమె బయోపిక్ గా మరో సినిమా రాబోతుంది. ఇండియన్ ఆస్ట్రేలియన్ యాక్ట్రెస్ చంద్రిక రవి.. సిల్క్ స్మితగా ఒక సినిమాని నేడు అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది.
Next Story