Mon Dec 23 2024 18:38:30 GMT+0000 (Coordinated Universal Time)
Sowmya Janu : హోమ్ గార్డ్ దాడి కేసులో.. హైకోర్టును ఆశ్రయించిన నటి సౌమ్య జాను..
హోమ్ గార్డ్ దాడి కేసులో తనని అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలంటూ సౌమ్య హైకోర్టుని ఆశ్రయించింది.
Sowmya Janu : చందమామ కథలు, తడాఖా, లయన్ వంటి సినిమాల్లో నటించిన సినీ నటి సౌమ్య జాను.. ఇటీవల బంజారా హిల్స్ పరిధిలో రాంగ్ రూట్ లో కారు నడిపాడమే కాకుండా ట్రాఫిక్ హోం గార్డు పై దాడికి పాల్పడింది. తాను చేసింది తప్పు అని తెలిసినా కూడా, తనని తాను సమర్ధించుకుంటూ మాట్లాడుతూ వీరంగం ఆడింది. ఇక ఈ విషయంలో పోలీసులు సౌమ్య పై కేసుని నమోదు చేసారు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సౌమ్య పై 332, 353, 427, 504, 279 సెక్షన్ల క్రింద కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసులో తనని అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలంటూ సౌమ్య హైకోర్టుని ఆశ్రయించింది. ఈ పిటిషన్ ని విచారించిన కోర్ట్.. అరెస్ట్ చేయకుండా 41A ప్రొసీడింగ్స్ ని ఫాలౌ అవ్వాలంటూ ఆదేశం ఇచ్చింది. అలాగే మార్చి 11న ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు హాజరుకావాలంటూ సౌమ్యకి కోర్ట్ ఆదేశం ఇచ్చింది.
కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌమ్య మాట్లాడుతూ.. తన పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు తనని విచారణకు పిలవలేదని, ఒకవేళ తనని అరెస్ట్ చేస్తే తాను కూడా ఆ హోమ్ గార్డ్ పై కేసు నమోదు చేస్తానని పేర్కొన్నారు. అంతేకాదు సెలబ్రిటీస్ రాంగ్ రూట్లో వెళ్లడంలో తప్పేంటి..? తన లాంటి స్టార్స్ నే పోలీసులు అడ్డుకొని ఇలా ప్రవర్తిస్తుంటే, ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటని తన తప్పుని సమర్ధించుకుంటూ వ్యాఖ్యానించారు.
Next Story