Fri Dec 20 2024 07:03:16 GMT+0000 (Coordinated Universal Time)
Anchor Suma : గిన్నిస్ రికార్డు.. యాంకర్ సుమ సంతోషం..
టాలీవుడ్ లో యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా సుమ తన ఇన్స్టాగ్రామ్లో..
Anchor Suma : టాలీవుడ్ లో యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టీవీ షో అయినా, సినిమా ఈవెంట్ అయినా ఆమె లేకుండా జరగడం అంటే చాలా కష్టం. రోజు ఏదో విధంగా ఆడియన్స్ ని పలకరిస్తూనే ఉంటారు. ఇలా టీవీ, సినిమా షోలతో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా సుమ అందుబాటులో ఉంటారు. సోషల్ మీడియా ద్వారా ఆమె కుటుంబ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు.
తాజాగా సుమ సంతోషం వ్యక్తం చేస్తూ ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ వేశారు. సుమ అమ్మమ్మ గారి తమ్ముడు 98 ఏళ్ళ వయసులో గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు సాధించినట్లు ఆమె పేర్కొన్నారు. సుమకి వరసకి తాతయ్య అయ్యే పి బాలసుబ్రమణ్యన్ మీనన్.. 73 ఏళ్ళగా లాయర్ వృత్తిలో కొనసాగుతూ వస్తున్నారు. ఈ ప్రొఫెషన్ లో ఇన్నాళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన లాయర్ గా బాలసుబ్రమణ్యన్ ప్రపంచ రికార్డుని సృష్టించారు.
ఇక ఈ విషయాన్ని గుర్తించిన గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు.. ఆయనకు అవార్డుని ఇచ్చి సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సుమ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. "ఈయన నాకు మాత్రమే కాదు ఎంతోమందికి స్ఫూర్తి. మా తాతయ్య ఒక సూపర్ హీరో" అంటూ గర్వంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. కొంతమంది అభిమానులు.. సుమ కూడా లక్షలాది షోలకు హోస్ట్ గా చేసి ఇలా ఒక గిన్నిస్ రికార్డు అందుకోవాలని కోరుతున్నారు.
ఇది ఇలా ఉంటే, టాలీవుడ్ లోకి సుమ కుటుంబం నుంచి కూడా ఒక హీరో రాబోతున్నాడు. సుమ కుమారుడు రోషన్.. ‘బబుల్ గమ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. న్యూ ఏజ్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 29న రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
Next Story