Tue Dec 24 2024 01:55:22 GMT+0000 (Coordinated Universal Time)
యాంకర్ సుమ తల్లిని చూశారా..? 82 ఏళ్ళ వయసులో జిమ్ వర్క్ అవుట్స్..!
యాంకర్ సుమ తల్లిని మీరు చూశారా..? 82 ఏళ్ళ వయసులో జిమ్ వర్క్ అవుట్స్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.
యాంకర్ సుమ.. తెలుగు వారికీ పరిచయం అవసరం లేని పేరు. టీవీ షోలు నుంచి సినిమా ఈవెంట్స్ వరకు కార్యక్రమం ఏదైనా.. అక్కడ సుమ ఉండాల్సిందే. తన డేట్స్ కోసం పెద్ద హీరోల ఫంక్షన్స్ కూడా సర్దుబాటు చేసుకోవాల్సిందే. మలయాళీ అమ్మాయిగా తెలుగు వారికీ పరిచయమైన సుమ.. తన అచ్చ తెలుగు మాటలతో, వాగ్దాటితో 'స్టార్ మహిళ' అనిపించుకుంది. మరి ఈ స్టార్ మహిళని తెలుగు వారికీ అందించిన.. అమ్మని మీరు చూశారా..? అదేనండి సుమ తల్లిని మీరు చూశారా..?
గతంలో అనేకసార్లు సుమ తన తల్లిని ఆడియన్స్ కి పరిచయం చేసింది. ఆమెతో ఫోటోలు, వీడియోలు చేస్తూ.. తన సోషల్ మీడియాలో అప్పుడప్పుడు షేర్ చేస్తుంటుంది సుమ. ప్రస్తుతం సుమ వాళ్ళ అమ్మకి 82 సంవత్సరాలు వయసు. దీంతో సుమ.. ఆమెను తన వద్దనే పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక తాజాగా సుమ తన తల్లికి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేయగా.. నెట్టింట వైరల్ గా మారింది.
ఆ వీడియోలో.. 82 ఏళ్ళ సుమ తల్లి జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ కనిపిస్తున్నారు. థ్రెడ్ మిల్ పై నడుస్తున్న ఆమెను చూసి నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ వీడియోకి సుమ ఇలా రాసుకొచ్చింది.. 'మా అమ్మ ఎనర్జీ ఎప్పటికి తగ్గదు. నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే అందుకు మా అమ్మే కారణం' అంటూ పేర్కొంది. ఇక ఈ పోస్టు చూసిన.. ఇంత వయసులో కూడా ఈమె ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కాగా సుమ కొడుకు 'రోషన్ కనకాల' ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. 'బబుల్ గమ్' అనే యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మంచి స్పందన అందుకుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా డిసెంబర్ 29న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
Next Story