Mon Dec 23 2024 14:41:21 GMT+0000 (Coordinated Universal Time)
సినిమా పేరుతో 500 మంది అమ్మాయిలను సెక్స్ రాకెట్లోకి దింపిన అసిస్టెంట్ డైరెక్టర్
తనకు సినీ పరిశ్రమలో అనేక పరిచయాలున్నాయని, అవకాశం ఇప్పిస్తామని అమ్మాయిలను ట్రాప్ చేశాడు. అనంతరం ఆ యువతులను..
సినిమా.. అదో అందమైన రంగుల ప్రపంచం. తెరపై కనిపించే హీరో, హీరోయిన్లను చూసి.. ఎంతోమంది వాళ్లలా అవ్వాలని కలలుగంటూ.. ఇండస్ట్రీకి వెళ్లాలన్న తపనతో ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. ఈ అందమైన రంగుల ప్రపంచం వెనుక.. కొన్ని చీకటి కోణాలూ ఉంటాయి. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర అన్నట్టుగా ఉంటారు ఆ చీకటి కోణాల రారాజులు. అవకాశాలు రాక కొందరు.. వచ్చిన అవకాశాలు సరిగా లేక మరికొందరు ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతుంటారు. అలాంటి వారిని.. సినిమా అవకాశాల పేరు చెప్పి సెక్స్ రాకెట్లోకి దించాడో టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఈ విషయం హైదరాబాద్ లో ఆన్లైన్ వ్యభిచారం ముఠా గుట్ట రట్టు కావడంతో వెలుగులోకి వచ్చింది. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ సహా మరొక వ్యక్తి అఖిల్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. సురేష్ బోయిన అనే వ్యక్తి 2017 నుండి టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. తనకు సినీ పరిశ్రమలో అనేక పరిచయాలున్నాయని, అవకాశం ఇప్పిస్తామని అమ్మాయిలను ట్రాప్ చేశాడు. అనంతరం ఆ యువతులను వ్యభిచారంలోకి దింపి ప్రముఖుల వద్దకు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై నిఘా పెట్టిన పోలీసులు.. అమ్మాయిల ఫోటోలను ఆన్లైన్లో పెట్టి వ్యభిచారం చేస్తున్నట్లుగా తెలుసుకున్నారు. సుమారు 500 మంది అమ్మాయిలతో అతను వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తూ గోవా, బెంగళూరు వంటి నగరాలకు సైతం యువతులను విటుల వద్దకు పంపుతున్నట్టు గుర్తించారు.
సినిమా అవకాశాల పేరుతో తెలుగు అమ్మాయిలను మాత్రమే కాదు.. ముంబై, ఢిల్లీ, బెంగాల్ సహా అనేక ప్రాంతాల యువతులను కూడా రంగంలోకి దింపి.. వ్యభిచారంలోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు ఈ బాగోతంలో అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. హోటల్స్, ఓయో రూమ్స్ అడ్డాగా వ్యభిచారం సాగుతుందని సమాచారం. లోకంటో, స్కొక్క, బ్యాక్ పేజి వెబ్ సైట్ లో అందమైన అమ్మాయిల ఫోటోలు పెడుతూ విటులను ఆకర్షిస్తున్నారని, ఈ ఇద్దరు నిందితులపై గతంలో కూడా బ్రోతల్ కేసులో బుక్ అయినట్లు పోలీసులు తెలిపారు.
Next Story