Mon Dec 23 2024 05:32:11 GMT+0000 (Coordinated Universal Time)
గన్నవరం చేరుకున్న సినీ ప్రముఖులు.. అక్కడి నుంచి నేరుగా సీఎం వద్దకు..
చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు తదితరులు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని
కొంతకాలం క్రితం ఏపీలో సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక జీఓ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా ఉంది పరిస్థితి. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు, కరోనా రాకతో.. పెద్ద సినిమాల విడుదలలన్నీ వరుసగా వాయిదాలు పడ్డాయి. ఇప్పుడు మళ్లీ విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 25న భీమ్లా నాయక్ సినిమాతో పెద్ద సినిమాల జాతర మొదలవ్వనుంది. ఈ నేపథ్యంలో ఏపీలో సినిమా టికెట్ల రేట్ల విషయంపై మరోసారి సీఎం జగన్ తో చర్చించేందుకు సిద్ధమయ్యారు సినీ ప్రముఖులు.
Also Read : ఫేస్ బుక్ లైవ్ లో విషం తాగిన దంపతులు
నేడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు జగన్ తో భేటీ అవ్వనున్నారు. నిజానికి నాగార్జున కూడా వస్తారని భావించగా.. ఆయన ఆఖర్లో డ్రాప్ అయ్యారు. తాజాగా.. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు తదితరులు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి బయల్దేరారు. జగన్ తో చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ, ఆర్.నారాయణ మూర్తి భేటీ కానున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ భేటీకి హాజరవుతారని టాక్ ఉన్నా.. ఆయన వస్తారో లేదో అన్న విషయంపై సందిగ్ధం నెలకొంది.
Next Story