Mon Dec 23 2024 13:03:07 GMT+0000 (Coordinated Universal Time)
వినాయక చవితి మూవీ అప్డేట్స్ ఇవే.. అలాగే సెలబ్రిటీస్ ఫెస్టివల్ పిక్స్..
నేడు దేశమంతటా వినాయక చవితి సంబరాలు జరుగుతున్నాయి. ఇక ఈ పండుగా సందర్భంగా టాలీవుడ్ మూవీ మేకర్స్, స్టార్స్..
నేడు దేశమంతటా వినాయక చవితి సంబరాలు జరుగుతున్నాయి. ఇక ఈ పండుగా సందర్భంగా మూవీ మేకర్స్.. రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమా అప్డేట్స్, షూటింగ్ జరుపుకుంటున్న మూవీ అప్డేట్స్ ఇచ్చి ఆడియన్స్ ని ఖుషీ చేశారు. ఈక్రమంలోనే రామ్ పోతినేని తన నటిస్తున్న 'స్కంద' మూవీ నుంచి ఐటెం సాంగ్ ని రిలీజ్ చేశాడు. ఇక బాలకృష్ణ నటిస్తున్న 'భగవంత్ కేసరి' పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటూ వస్తున్న వార్తలకు మూవీ టీం కొత్త పోస్టర్ తో చెక్ పెట్టింది.
రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సెకండ్ సింగల్ అప్డేట్ ని ఇస్తే.. తేజ సజ్జ తన నటిస్తున్న సూపర్ హీరో మూవీ 'హనుమాన్' ప్రమోషన్స్ ని నేటి నుంచి మొదలు పెట్టాడు. బాలీవుడ్ సినిమాలు రణబీర్ 'యానిమల్', టైగర్ ష్రాఫ్ 'గణపత్' రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. యానిమల్ టీజర్ రిలీజ్ గురించి కూడా అప్డేట్ ఇచ్చారు. అలాగే వెంకటేష్ 'సైంధవ్', నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీలతో పాటు మరికొన్ని చిత్రాలకు సంబంధించిన కొత్త పోస్టర్ లు రిలీజ్ అయ్యాయి.
ఇక మూవీ అప్డేట్స్ ఇలా ఉంటే, వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్ స్టార్స్ అభిమానులకు పండుగా శుభాకాంక్షలు తెలియయజేస్తూ షేర్ చేసిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. చిరంజీవి తన మనవరాలు 'క్లీంకార'తో కలిసి మొదటి వినాయక చవితి చేసుకోవడం సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేశాడు. ఇక డెలివరీ అయిన తరువాత ఉపాసన.. క్లీంకారని తీసుకోని ఇవాళే రామ్ చరణ్ ఇంటికి వచ్చింది.
దీంతో మెగా కుటుంబం వారికీ గ్రాండ్ గా వెల్కమ్ పలికింది. లావణ్య త్రిపాఠి పెళ్ళికి ముందే వరుణ్ తేజ్ ఇంటిలో పండుగా జరుపుకుంటూ సందడి చేసింది. హీరో నాని తన కొడుకుతో కలిసి విఘ్నేశ్వరుడి పూజలో పాల్గొని కథలు వింటున్నాడు. హీరో సుధీర్ తన ఇంటిలో వినాయక చవితి సెలబ్రేషన్స్ వీడియోని షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన పోస్టులు అన్ని ఒకసారి మీరుకూడా చూసేయండి.
Next Story