Mon Dec 23 2024 08:40:24 GMT+0000 (Coordinated Universal Time)
హాస్యబ్రహ్మకు ఎన్టీఆర్ పురస్కారం
ఈ ఏడాది ఎక్స్ రే సేవా సంస్థ అధ్యక్షుడు కొల్లూరి ఎన్టీఆర్ అవార్డు ప్రధానోత్సవాల కార్యక్రమాన్ని విజయవాడ తుమ్మలపల్లి..
హాస్యబ్రహ్మ, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఎన్టీ రామారావు పురస్కారం అందుకున్నారు. ప్రతి సంవత్సరం స్వర్గీయ ఎన్టీ రామారావు పేరిట పురస్కారాలను అందజేస్తారు. ఈ ఏడాది ఎక్స్ రే సేవా సంస్థ అధ్యక్షుడు కొల్లూరి ఎన్టీఆర్ అవార్డు ప్రధానోత్సవాల కార్యక్రమాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేతంలో నిర్వహించారు. ఈ వేడుకలో వివిధ రంగాలకు చెందిన 35 మందికి ఎన్టీఆర్ సెంటినరీ పురస్కారాలను అందజేశారు. గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో.. బ్రహ్మానందం ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వర్గీయ ఎన్టీఆర్ తో కలిసి చేసింది అతి కొద్ది సినిమాలే అయినా.. నటనపరంగా, వ్యక్తిగతంగా ఆయన నుండి ఎంతో నేర్చుకున్నానన్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ యుగం స్వర్ణ యుగమని కొనియాడారు. ఎన్టీఆర్ సెంటినరీ పురస్కారాన్ని అందుకోవడం తనకు మహాభాగ్యమని బ్రహ్మానందం పేర్కొన్నారు. ఈ వేడుకలో గద్దె రామ్మోహన్ రావు, టీడీపీ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
Next Story