Mon Dec 23 2024 06:56:57 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీవారిని దర్శించుకున్న అక్కినేని నాగార్జున, అమల
ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో నాగార్జున, ఆయన సతీమణితో కలిసి ఆలయానికి విచ్చేశారు. స్వామివారి సేవలో
ప్రముఖ టాలీవుడ్ ఎవర్ గ్రీన్ కపుల్ అక్కినేని నాగార్జున, అమల శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో నాగార్జున, ఆయన సతీమణితో కలిసి ఆలయానికి విచ్చేశారు. స్వామివారి సేవలో పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు.
శ్రీవారి దర్శనానంతరం నాగార్జున మీడియాతో మాట్లాడారు. కోవిడ్ కారణంగా శ్రీవారిని దర్శించుకుని రెండేళ్లయిందని, మళ్లీ ఇప్పటికి ఆయన దర్శన భాగ్యం కలిగిందన్నారు. ఈ ఏడాది నుంచి అందరూ బాగుండాలని, ప్రపంచంలో అందరికీ మంచి జరగాలని ప్రార్థించినట్లు నాగార్జున తెలిపారు. కాగా.. నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా సంక్రాతికి విడుదలైన విషయం తెలిసిందే. పండుగ సీజన్ కు ఉన్న ఏకైక సినిమా, పండగలాంటి సినిమా కావడంతో బంగార్రాజు.. మంచి వసూళ్లను రాబడుతోంది.
News Summary - Tollywood Couple Akkineni Nagarjuna and Amala Visits Tirumala Srivari Temple
Next Story