Mon Dec 23 2024 11:50:46 GMT+0000 (Coordinated Universal Time)
నెటిజన్ పై ఘాటుగా స్పందించిన డైరెక్టర్ !
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ డైరెక్టర్లలో హరీష్ శంకర్ ఒకరు. నెటిజన్లు అడిగే ప్రశ్నలపై, వారు చేసే ట్వీట్లపై హరీష్
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ డైరెక్టర్లలో హరీష్ శంకర్ ఒకరు. నెటిజన్లు అడిగే ప్రశ్నలపై, వారు చేసే ట్వీట్లపై హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా ఆయన ఒమిక్రాన్ ను గురించి ఓ ప్రముఖ వైద్య నిపుణుడి వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఒమిక్రాన్ ను గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యుడు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూనే.. వైరస్ వ్యాప్తి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అయితే ఈ వీడియోపై ఓ నెటిజన్ సీరియస్ గా స్పందించాడు. హరీష్ శంకర్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని, ఒమిక్రాన్ ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆ నెటిజన్ వ్యాఖ్యలపై హరీష్ శంకర్ ఘాటుగా స్పందించారు. ప్రజల్లో ఆశలు పెంచే దిశగా.. వైద్యుడు మంచి చెప్పినా.. మీలాంటి స్టూపిడ్స్ నిరాశ చెందుతూనే ఉంటారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Next Story