Mon Dec 23 2024 08:28:11 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ దర్శకుడు కన్నుమూత
బ్రహ్మానందంని హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసింది కూడా ఈయనే. ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ సినిమాలో బ్రహ్మానందంని..
టాలీవుడ్ లో కొద్దిరోజులుగా వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. వారంరోజుల వ్యవధిలో ఒక సంగీత దర్శకుడు, ఒక నటుడు, ఒక దర్శకుడిని కోల్పోయింది. రాజ్ కోటి ద్వయంలో ఒకరైన రాజ్ గుండెపోటుతో మరణించడం అందరినీ కలచివేసింది. ఆ విషాదం నుంచి తేరుకోకుండా శరత్ బాబు మరణించారు. తాజాగా మరో దర్శకుడు కన్నుమూశారు. ప్రముఖ దర్మక నిర్మాత కె వాసు శుక్రవారం (మే26) మృతి చెందారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన..శుక్రవారం సాయంత్రం ఫిలిం నగర్లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న ప్రముఖ నటీనటులు సంతాపం తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ‘ప్రాణంఖరీదు’ సినిమాతో వెండితెరకు పరిచయం చేసింది కె వాసునే. ఆ తర్వాత కోతలరాయుడు, తోడుదొంగలు, అల్లులొస్తున్నారు సినిమాలు కూడా డైరెక్ట్ చేశారు. బ్రహ్మానందంని హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసింది కూడా ఈయనే. ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ సినిమాలో బ్రహ్మానందంని హీరోగా చూపించారు. విజయ చందర్ సాయిబాబాగా నటించిన ‘శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం’ని కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. ‘అయ్యప్ప స్వామి మహత్యం’ని కూడా వాసునే డైరెక్ట్ చేశారు. చివరిగా శ్రీకాంత్, ప్రభుదేవాలతో ‘ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి’ చిత్రాన్ని తీసి హిట్ అందుకున్నారు.
Next Story