Mon Dec 23 2024 06:43:19 GMT+0000 (Coordinated Universal Time)
పబ్లిక్ గా హీరోయిన్ ను ముద్దుపెట్టుకున్న టాలీవుడ్ డైరెక్టర్
సినిమాను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలంటే చాలానే చేయాలి. అందుకు సంబంధించి హెల్తీ పబ్లిసిటీ దారిలో నడిచే వాళ్లు కొందరు
సినిమాను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలంటే చాలానే చేయాలి. అందుకు సంబంధించి హెల్తీ పబ్లిసిటీ దారిలో నడిచే వాళ్లు కొందరు ఉంటారు. ఇంకొందరు సినిమాను చీప్ గా రెచ్చిపోతూ ఉంటారు. ఇలాంటి ప్రమోషన్స్ వల్ల మైలేజీ కంటే డ్యామేజీనే ఎక్కువ ఉంటుంది. అందుకే స్టేజీల మీద, మీడియా సమావేశాల్లో కాస్త పద్దతిగా ప్రవర్తించాలి. అయితే కొందరు మాత్రం అతి చేస్తూ అడ్డంగా దొరికిపోతూ ఉంటారు. హీరోలు, దర్శకులు, టెక్నీషియన్స్ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ AS రవి కుమార్ చౌదరి ఒక పబ్లిక్ ఈవెంట్లో నటి మన్నారా చోప్రాను ముద్దుపెట్టుకున్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ‘తిరగబడరా సామి’. సినిమాలో హింసను వ్యతిరేకించే అమాయకపు కుర్రాడి పాత్రలో రాజ్ తరుణ్ కనిపిస్తాడు. కానీ అతను ప్రేమించిన అమ్మాయి హింసను ఇష్టపడుతుంది. మన్నారా చోప్రా కూడా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన మాల్వీ మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్ ముందు మన్నారా భుజంపై చేయివేసి, ఫొటోలకు పోజులిచ్చిన రవి కుమార్ చౌదరి ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. ఆ సమయంలో మన్నారా చోప్రా నవ్వుతూ సైలెంట్ అయిపోయింది. ఈ ముద్దు సమయంలో ఆమె కాస్త అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయిందని మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది. 2013లో రాజ్ తరుణ్ నటించిన ‘ఉయ్యాలా జంపాలా’ విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ ‘సినిమా చూపిస్తా మావా’, ‘కుమారి 21ఎఫ్’ చిత్రాలు వరుస విజయాలను అందుకున్నాయి. కానీ విజయాలను కొనసాగించడంలో విఫలమయ్యాడు. మార్కెట్ కూడా బాగా డౌన్ అయింది. కొన్ని సినిమాలలో రాజ్ తరుణ్ ఎందుకు చేశాడో.. అసలు ఆ సినిమాలో రాజ్ తరుణ్ ఎందుకు ఉన్నాడో కూడా తెలియదు. ఈసారి రాజ్ తరుణ్ ‘తిరగబడరా సామి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.
Next Story