Mon Dec 23 2024 11:55:11 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళికి హాలీవుడ్ ప్రతిష్టాత్మక అవార్డు
బాలీవుడ్ లో ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇటీవలే జాపనీస్ భాషలో జపాన్ లోనూ ..
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. హాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా భావించే 'ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్' అవార్డును రాజమౌళి సొంతం చేసుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుతో రాజమౌళి పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ 1200 కోట్ల వసూళ్లు చేసి భారీ హిట్ కొట్టింది.
బాలీవుడ్ లో ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇటీవలే జాపనీస్ భాషలో జపాన్ లోనూ ఆర్ఆర్ఆర్ ను విడుదల చేశారు. కాగా.. 1935 నుండి వార్తాపత్రికలు, మేగజీన్స్, ఆన్ లైన్ పబ్లికేషన్లకు చెందిన పలువురు ప్రముఖులు ఒక బృందంగా ఏర్పడి ఈ అవార్డులను అందజేస్తున్నారు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా శాటర్న్, సన్ సెట్ సర్కిల్ వంటి పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది.
Next Story