Mon Dec 23 2024 03:33:19 GMT+0000 (Coordinated Universal Time)
దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు సతీవియోగం
సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీకల్యాణిల వివాహం 1960లో జరిగింది. సినిమా రంగంలో లక్ష్మీ కల్యాణి సింగీతానికి ఎంతో..
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు సతీ వియోగం కలిగింది. సింగీతం సతీమణి లక్ష్మీకల్యాణి శనివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం రాత్రి 9.10 గంటలకు చెన్నైలో మరణించినట్లు సింగీతం శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 'నా భార్య లక్ష్మీ కల్యాణి శనివారం రాత్రి 9.10గంటలకు తుదిశ్వాస విడిచింది. 62 ఏళ్ల సుదీర్ఘమైన మా భాగస్వామ్యానికి ముగింపు పడింది' అని ఆయన పేర్కొన్నారు.
సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీకల్యాణిల వివాహం 1960లో జరిగింది. సినిమా రంగంలో లక్ష్మీ కల్యాణి సింగీతానికి ఎంతో తోడ్పాటునందించారు. స్క్రిప్ట్ రచనలో ఆయనకు సహాయం చేసేవారు. అందుకే.. తన సతీమణిని గురించి 'శ్రీకల్యాణీయం'అనే ఓ పుస్తకాన్ని కూడా రాశారు సింగీతం. చాలాకాలంగా సింగీతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రభాస్ నటించబోతున్న ప్రాజెక్ట్ కే అనే సినిమాకు కన్సల్టెంట్ గా వ్యవహరించేందుకు ఒప్పుకున్నారు. కానీ.. అనారోగ్య సమస్యల కారణంగా ప్రభాస్ సినిమా నుంచీ తప్పుకున్నారు.
Next Story