Mon Dec 23 2024 14:23:38 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాన్స్ నన్ను ఇబ్బందులు పెడుతున్నారు.. జగపతిబాబు లెటర్..
ఇక నుంచి అభిమానులతో నాకు సంబంధం లేదంటూ ఫ్యాన్స్ కోసం ఒక లెటర్ ని రిలీజ్ చేసిన జగపతిబాబు. అసలు ఇంతకీ ఏం జరిగింది..?
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా కుటుంబకథా చిత్రాలతో ఆడియన్స్ ని అలరించిన జగపతిబాబు.. 'లెజెండ్' సినిమాతో విలన్ గా టర్నింగ్ పాయింట్ తీసుకోని ప్రస్తుతం సౌత్ టు నార్త్ స్టార్ హీరోల సినిమాల్లో విలన్స్ గా చేస్తూ వస్తున్నాడు. సినిమాల్లో ప్రతినాయకుడిగా తన విలనిజంతో భయపెట్టే జగపతి బాబు సోషల్ మీడియాలో.. ఫుల్ జోవియల్ గా ఉంటాడు.
జగపతిబాబు చేసే ట్వీట్స్ నెటిజెన్స్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే తాజాగా ఈ హీరో ఒక సీరియస్ పోస్టు చేశాడు. తన అభిమానులే తనని ఇబ్బందులు పెడుతున్నారు అంటూ పేర్కొన్నాడు. ఇక నుంచి మీతో నాకు సంబంధం లేదంటూ అభిమానుల కోసం ఒక లెటర్ ని రిలీజ్ చేశాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది..? జగ్గూభాయ్ ఈ షాకింగ్ నిర్ణయం వెనుక రీజన్ ఏంటి..?
ఇండస్ట్రీలోని హీరోలు తమని స్టార్ చేసిన అభిమానుల పట్ల కృతజ్ఞతా భావం చూపిస్తుంటారు. ఫ్యాన్స్ కష్టాల్లో ఉన్న సమయంలో తమవంతు సహాయం చేస్తుంటారు. ఈక్రమంలోనే జగపతి బాబు కూడా ఎప్పటినుంచో తన ఫ్యాన్స్కి.. అభిమాన సంఘాలు, ట్రస్ట్ ద్వారా తనవంతు సహాయం అందిస్తూ వస్తున్నాడు. అయితే ఆ సహాయం కోసం ఇప్పుడు జగపతిబాబుని అభిమానులు ఇబ్బందులు పెడుతున్నారట.
జగపతి బాబు నుంచి ఎక్కువ సహాయం ఆశిస్తూ ఇబ్బంది పెడుతున్నారట. "అభిమానులు అంటే ప్రేమాభిమానాలు చూపించేవారని ఇన్నాళ్లు మనస్ఫూర్తిగా నమ్మను, కానీ వాళ్ళు అభిమానం, ప్రేమ కంటే ఆశించటం ఎక్కువ చూపిస్తున్నారు. దీని వల్ల నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే కష్టం అనిపించినా ఒక నిర్ణయం తీసుకున్నాను. నా అభిమాన సంఘాలు, ట్రస్ట్ కి ఉన్న నా సంబంధాన్ని విరమించుకుంటున్నాను. అయితే ప్రేమించే అభిమానుల కోసం నేను ఎప్పుడు తోడుగానే ఉంటాను" అంటూ పేర్కొన్నాడు. ఇక ఈ లెటర్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Next Story