Sun Dec 22 2024 22:31:42 GMT+0000 (Coordinated Universal Time)
శర్వానంద్ పెళ్లి.. తారల సందడి
శుక్రవారమే హల్దీ, సంగీత్ సహా మరిన్ని కార్యక్రమాలు జరిగాయి. సంగీత్ ప్రొగ్రామ్‌లో శర్వానంద్-రామ్ చరణ్ తేజ్ స్టెప్పులతో
టాలీవుడ్ నటుడు శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్ కు వీడ్కోలు పలికాదు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయిన రక్షిత రెడ్డిని గత రాత్రి రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నాడు. గత రాత్రి 11 గంటలకు గ్రాండ్ రాయల్ వెడ్డింగ్ జరిగింది. రామ్ చరణ్, సిద్ధార్థ్, నిర్మాత వంశీ, పలువురు రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు ఈ పెళ్ళికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అతని జీవితంలో కొత్త దశను ప్రారంభించినందుకు నెటిజన్లు అభినందిస్తున్నారు. హైదరాబాద్ లో శర్వానంద్ గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్నారు.
శుక్రవారమే హల్దీ, సంగీత్ సహా మరిన్ని కార్యక్రమాలు జరిగాయి. సంగీత్ ప్రొగ్రామ్‌లో శర్వానంద్-రామ్ చరణ్ తేజ్ స్టెప్పులతో అదరగొట్టారు. వాల్తేరు వీరయ్య సినిమాలోని పూనకాలు లోడింగ్ పాటకు చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ప్రస్తుతం పెళ్లి కారణంగా బ్రేక్ తీసుకున్నాడు. ఇది శర్వానంద్ 35వ సినిమాగా ఉంది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం గతేడాది మంచి విజయాన్ని అందుకుంది.
Next Story