Mon Dec 23 2024 13:04:11 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న నాగశౌర్య.. పెళ్లికూతురు ఎవరో?
నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఓ వార్త బయటికొచ్చింది. ఇండస్ట్రీలో పీఆర్ గా ఉన్న వంశీ కాక ఈ విషయాన్ని ..
2014లో ఊహలు గుసగుసలాడే సినిమాతో వచ్చి.. అమ్మాయిల మదిని దోచుకున్న ఆరడుగుల అందగాడు, హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నాడట. తెలుగు తెరపై హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి దాదాపు పుష్కరకాలం.. అంటే పన్నెండేళ్లు కావొస్తోంది. 12 ఏళ్లలో 24 సినిమాలు చేశాడు. 24వ సినిమా అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. త్వరలోనే మరో రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి రానున్నట్లు సమాచారం. రొమాంటిక్ హీరోగా ఆడియన్స్ నుండి మంచి మార్కులు కొట్టేసిన నాగశౌర్య.. విభిన్న కథలపై దృష్టిపెడుతుంటాడు.
తాజాగా.. నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఓ వార్త బయటికొచ్చింది. ఇండస్ట్రీలో పీఆర్ గా ఉన్న వంశీ కాక ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నాగశౌర్య పెళ్లి కొడుకు అవుతున్నాడనే విషయాన్ని ట్వీట్ చేశారు. అనూష అనే అమ్మాయితో శౌర్య వివాహం జరగనుందని.. ఈ నెల 19, 20 బెంగుళూరులో ఘనంగా వివాహ వేడుకలు జరుగుతాయని స్పష్టం చేశారు. కాగా.. ఇంతకీ నాగశౌర్యని చేసుకోబోయే ఆ లక్కీ అమ్మాయి అనూష ఎవరు? ఆమె ఫ్యామిలీ నేపథ్యం ఏమిటనేది తెలియాల్సి ఉంది.
Next Story