Mon Dec 23 2024 17:38:40 GMT+0000 (Coordinated Universal Time)
రాజమండ్రిలో రామ్ చరణ్
టాలీవుడ్ హీరో రామచరణ్ కొద్దిసేపటి క్రితం రాజమండ్రి వచ్చారు
టాలీవుడ్ హీరో రామచరణ్ కొద్దిసేపటి క్రితం రాజమండ్రి వచ్చారు. మధురపూడి విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రామ్ చరణ్ వస్తున్నారని తెలిసి విమానాశ్రయానికి పెద్దసంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. రామ్ చరణ్ తో కరచాలనానికి పోటీ పడ్డారు. ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు.
షూటింగ్ కోసం....
కాగా ఒక షూటింగ్ నిమిత్తం రామ్ చరణ్ రాజమండ్రి వచ్చినట్లు తెలిసింది. మధురపూడి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని మలకపల్లి గ్రామానికి ఆయన వెళ్లనున్నారు. అక్కడ సినిమా షూటింగ్ ఉండటంతో ఆయన రాక తెలుసుకుని దారిపొడవునా అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు.
Next Story