Sun Dec 22 2024 13:33:28 GMT+0000 (Coordinated Universal Time)
Sharwanand : ఆడపిల్లకు తండ్రి అయిన శర్వానంద్.. పేరు ఏంటంటే..
తన బర్త్ డే రోజు శర్వానంద్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. తాను ఆడపిల్లకు తండ్రి అయినట్లు పేర్కొన్నారు. అలాగే ఆ పాపకి ఏం పేరు పెట్టారో..
Sharwanand : టాలీవుడ్ హీరో శర్వానంద్ గత ఏడాది జూన్ 3న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి జీవితం కొంచెం లేటుగా స్టార్ట్ చేసిన శర్వానంద్.. ఫాదర్హుడ్ లైఫ్ ని మాత్రం వెంటనే స్టార్ట్ చేసేసారు. ఈరోజు (మార్చి 6) తన బర్త్ డే కావడంతో.. ఓ గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకున్నారు.
సోషల్ మీడియా ద్వారా తాను తండ్రి అయ్యినట్లు చెప్పుకొచ్చారు. రక్షిత రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పుకొచ్చారు. అలాగే పాపతో ఉన్న కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసారు. అయితే ఆ పిక్స్ చూస్తుంటే.. పాప పుట్టి చాలా రోజులు అవుతుందని తెలుస్తుంది. ఇన్ని రోజులు రహస్యంగా ఉంచిన ఈ శుభవార్తని.. నేడు పుట్టినరోజు నాడు అందరికి తెలియజేసారు.
ఇక ఈ పాపకి ఏం పేరు పెట్టారో కూడా శర్వానంద్ తెలియజేసారు. 'లీలా దేవి మైనేని' అనే పేరుని పెట్టినట్లు శర్వానంద్ చెప్పుకొచ్చారు. ఇక ఈ పోస్టు చూసిన నెటిజెన్స్.. శర్వానంద్ కి బర్త్ డే విషెస్ తో పాటు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం శర్వా పోస్టు చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ పిక్స్ వైపు మీరు ఓ లుక్ వేసేయండి.
Next Story