Mon Dec 23 2024 14:54:50 GMT+0000 (Coordinated Universal Time)
Aarthi Agarwal : చివరి రోజుల్లో ఆ డాన్స్ మాస్టర్ దగ్గర కన్నీళ్లు పెట్టుకున్న ఆర్తి అగర్వాల్..
హీరోయిన్ ఆర్తి అగర్వాల్.. చివరి రోజుల్లో ఆ డాన్స్ మాస్టర్ దగ్గర బోరున కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక బయటకి రాను అంటూ..
Aarthi Agarwal : టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్.. కెరీర్ స్టార్టింగ్ లోనే స్టార్ హీరోలో అయిన వెంకటేష్, చిరంజీవి పక్కన బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి ఓ రేంజ్ స్టార్డమ్ ని సంపాదించుకున్నారు. కానీ ఎంత త్వరగా స్టార్ స్టేటస్ ని అందుకున్నారో.. అంతే త్వరగా కెరీర్ లో డౌన్ ఫాల్ ని చూశారు. క్యూట్ గా కనిపిస్తూ కుర్రాళ్ళ మనసు దోచుకున్న ఆర్తి అగర్వాల్.. ఆ తరువాత విపరీతంగా వెయిట్ గెయిన్ అవ్వడంతో మానసికంగా చాలా బాధని అనుభవించారు.
అందంగా కనిపించేందుకు విదేశాల్లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని.. శ్వాస సంబంధిత సమస్యని ఎదుర్కొని 31 ఏళ్ళ వయసులోనే కన్నుమూశారు. ఆమె మరణం చాలామందిని బాధించింది. 2015లో ఆమె మరణించినా.. ఇప్పటికి ఆమె పేరు టాలీవుడ్ లో అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. తాజాగా డాన్స్ మాస్టర్ కమ్ దర్శకుడు అమ్మ రాజశేఖర్.. ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో జరిగిన ఓ విషయాన్ని ఆడియన్స్ కి తెలియజేశారు.
అమ్మ రాజశేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతూ.. 2006లో గోపీచంద్ తో తెరకెక్కించిన సినిమా 'రణం'. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. దానికి సీక్వెల్ ని హీరో శ్రీహరితో తెరకెక్కించాలని అనుకున్నారట. ఆ మూవీ హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ని అనుకున్నారు. అయితే శ్రీహరి అనారోగ్యంతో.. ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఆరు నెలలు సమయం పట్టింది. ఆ తరువాత చిత్రీకరణ మొదలైన తరువాత సెట్స్ కి వచ్చిన ఆర్తి అగర్వాల్ ని చూసిన అమ్మ రాజశేఖర్ షాక్ అయ్యారట.
ఆర్తి అగర్వాల్ చాలా లావుగా కనిపించారంటా. ఆమెకు కాస్ట్యూమ్ కూడా సెట్ అవ్వడం లేదు. దీంతో ఆమె అమ్మ రాజశేఖర్ ముందు ఏడ్చేశారంటా. నాకు కాస్ట్యూమ్ కూడా సెట్ అవ్వడం లేదని బోరున కన్నీళ్లు పెట్టుకున్నారట. ఇక నేను బయటకి రాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారంటా. ఇక ఆ తరువాతే వెయిట్ తగ్గడం కోసం సర్జరీ చేయించుకొని ప్రాణాలు మీదకు తెచ్చుకొని చిన్న వయసులోనే మరణించారు.
Next Story