Mon Dec 23 2024 15:07:44 GMT+0000 (Coordinated Universal Time)
Krithi Shetty: బెల్లీ డ్యాన్స్తో కుర్రాళ్ళని పడగొడుతున్న కృతిశెట్టి..
బెల్లీ డ్యాన్స్తో కుర్రాళ్ళని పడగొడుతున్న కృతిశెట్టి. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Krithi Shetty : అందాల భామ కృతిశెట్టి.. 'ఉప్పన' సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడంతో.. తెలుగులో వరుస ఆఫర్స్ అందిపుచ్చుకున్నారు. అయితే ఆ తరువాత అదృష్టం అంత కలిసిరాలేదు. దీంతో బ్యాక్ టు బ్యాక్ నాలుగు ప్లాప్ లు అందుకున్నారు. ఈ రిజల్ట్స్ తో ఛాన్స్ లు కూడా తగ్గాయి.
ఇక అవకాశాలు కోసం సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోషూట్స్ చేస్తూ మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కృతి అందాలకు తెలుగు మేకర్స్ పడడం లేదు. కానీ తమిళ, మలయాళం నుంచి అయితే ఆఫర్స్ వస్తున్నాయి. ఈక్రమంలోనే మలయాళంలో ఓ సినిమా, తమిళంలో మూడు సినిమాలు, తెలుగులో ఆల్రెడీ గతంలో కమిట్ అయిన ఓ మూవీ చేస్తున్నారు. మరి తెలుగు మేకర్స్ అందాలకు పడడం లేదు అనుకున్నారో ఏమోగానీ, ఇప్పుడు తనలోని టాలెంట్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు కృతి.
ఈక్రమంలోనే బెల్లీ డాన్స్ చేస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు. తాజాగా కృతిశెట్టి తన ఇన్స్టాగ్రామ్లో.. తన బెల్లీ డాన్స్ కి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. విజయ్ 'బీస్ట్' మూవీలోని 'అరబిక్ కుతూ' సాంగ్ కి కృతి నాగినిలా నడుముని తిప్పుతూ కుర్రాళ్లను ఫిదా చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఆ డాన్స్ ని కూడా కృతినే కోరియోగ్రఫీ చేశారట. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి కృతి బెల్లీ డాన్స్ ని మీరు కూడా చూసేయండి.
Next Story