Mon Dec 23 2024 11:36:40 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు బయటకి రావాలని హీరోయిన్ పూజలు..
చంద్రబాబు నాయుడు త్వరగా జైలు నుంచి బయటకి తాజాగా ఒక హీరోయిన్ దుర్గమ్మకు పూజలు నిర్వహించేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ సంచలనంగా మారింది. ఆయన బయటకి వస్తారని ఎదురు చూస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కోర్టులో చుక్క ఎదురవుతూనే ఉంది. ఇది ఇలా ఉంటే, ఈ అరెస్ట్ గురించి రాజకీయ నాయకులు, ఐటీ ఉద్యోగులు, సినిమా ప్రముఖులు స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా ఒక హీరోయిన్ అయితే చంద్రబాబు కోసం ఏకంగా పూజలు కూడా నిర్వహించేస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. పొలిటికల్ గా హాట్ కామెంట్స్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతుంటుంది. తాజాగా ఈ హీరోయిన్ దసరా నవరాత్రులు సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మని తన కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది.
అనంతరం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ గురించి వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు నాయుడు ఉన్న వయసులో ఆయన జైలులో ఉండడం తనని బాగా కలిచి వేసిందని పూనమ్ పేర్కొంది. ఆయన త్వరగా జైలు నుంచి బయటకి రావాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆమె మీడియాకి తెలియజేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇది ఇలా ఉంటే, ఈ విషయం పై తమిళ్ హీరో రజినీకాంత్, విశాల్ నుంచి తెలుగు దర్శకనిర్మాతలు సైతం రియాక్ట్ అవుతుంటే.. నందమూరి వారసుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎందుకు స్పందించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
Next Story