Mon Dec 23 2024 16:02:44 GMT+0000 (Coordinated Universal Time)
సమంత లైఫ్ లో మ్యాజిక్.. కొత్త ఫొటోలతో పోస్టులు
తాజాగా సమంత తన ఫొటోలు షేర్ చేస్తూ.. తన లైఫ్ లో మ్యాజిక్ జరుగుతోందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సామ్
సమంత.. కొద్దినెలలుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే.. అది సమంత - చైతన్య విడాకుల గురించే. ఇప్పటికీ ఈ విషయంపై టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటూనే ఉన్నాయి. విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు కానీ.. ఎందుకు విడిపోతున్నారో చెప్పకపోవడం వల్ల చాలా రూమర్లు షికార్లు చేశాయి. ఇప్పుడిప్పుడు ఎవరి జీవితంలో వారు బిజీ అవుతున్నారు. ఇటు సమంతకు, అటు చైతన్యకూ చేతినిండా సినిమాలు ఉండటంతో.. షూటింగ్ లలో బిజీ అయిపోయారు. తాజాగా సమంత తన ఫొటోలు షేర్ చేస్తూ.. తన లైఫ్ లో మ్యాజిక్ జరుగుతోందని చెప్పుకొచ్చింది.
Also Read : ప్రకృతి విలయం.. భారీ హిమపాతానికి 42 మంది మృతి
ప్రస్తుతం సామ్ స్విట్జర్లాండ్ విహారయాత్రలో ఉంది. ఈ ట్రిప్ కు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి, తన అనుభవాలను నెటిజన్లతో పంచుకుంటోంది. తాజాగా సామ్ షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఆదివారం సాయంత్రం ఈ బ్యూటీ పంచుకున్న పిక్ లో జీన్స్తో పాటు నలుపు రంగు క్రాప్ టాప్ ధరించింది. పోనీటైల్ వేసుకుని ఫొటోకు ఫోజిచ్చింది. "దీనికి అలవాటు పడవచ్చు" అని ఆ పోస్ట్ కింద రాసింది. అంతకుముందు.. స్నో స్పోర్ట్లో ఆడుతున్న వీడియోను, స్విట్జర్లాండ్లోని మంచు పర్వతాలలో తాను ఉన్న చిత్రాన్ని కూడా షేర్ చేసింది. "4వ రోజు మ్యాజిక్ జరుగుతుంది. #skiingainteasybutitsureisfun" అంటూ ఆ ఫోటో గురించి రాసుకొచ్చింది.
Next Story