Sun Jan 12 2025 20:17:37 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ బాబుకు అల్లుఅర్జున్, విజయ్ దేవరకొండ పరామర్శ
టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ కూడా కృష్ణ నివాసానికి వచ్చారు. తీవ్ర విషాదంలో ఉన్న మహేశ్ బాబుని ఆత్మీయంగా హత్తుకుని..
హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో సూపర్ స్టార్ కృష్ణ నివాస ప్రాంగణంలో విషాద వాతావరణం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖల సందర్శనార్థం సాయంత్రం 5 గంటల వరకూ కృష్ణ భౌతిక కాయాన్ని ఆయన నివాసం వద్ద ఉంచనున్నారు. టాలీవుడ్ ప్రముఖులు కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించి.. మహేష్ బాబుని పరామర్శిస్తున్నారు.
టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ కూడా కృష్ణ నివాసానికి వచ్చారు. తీవ్ర విషాదంలో ఉన్న మహేశ్ బాబుని ఆత్మీయంగా హత్తుకుని పరామర్శించారు. అనంతరం కృష్ణ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మహేశ్ బాబు, కృష్ణ అల్లుడు సుధీర్ బాబు ల పక్కనే కూర్చుని ఓదార్చారు. రౌడీ హీరో విజయదేవరకొండ కూడా కృష్ణ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
Next Story