Mon Dec 23 2024 04:17:06 GMT+0000 (Coordinated Universal Time)
రేపు అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు
ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు మృతితో టాలివుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.
ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు మృతితో టాలివుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ లో ప్రముఖలంతా కృష్ణంరాజు పార్ధీవదేహానికి నివాళలర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కృష్ణంరాజు ఇంటికి వచ్చి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు సోదరుడు కుమారుడు సీనీ హీరో ప్రభాస్ ను అడిగి ఆయన మృతికి గల కారణాలను తెలుసుకున్నారు.
పలువురు సంతాపం..
అలాగే హీరో మహేష్ బాబు కూడా కృష్ణంరాజుకు ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కృష్ణంరాజుకు నివాళులర్పించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావులు నివాళులర్పించిన పార్టీకి కృష్ణంరాజు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కేంద్రమంత్రిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. సినీనటుడు మోహాన్ బాబు కృష్ణంరాజు పార్ధీవదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
అభిమానుల కోసం...
రేపు కృష్ణంరాజు పార్ధీవ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో అభిమానుల సందర్శనార్ధం కోసం ఆయన పార్ధీవ దేహాన్ని ఉంచుతారు. అనంతరం ఫిలింనగర్ క్లబ్ లో కృష్ణంరాజు పార్ధీవదేహాన్ని ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చీఫ్ సెక్రటరీని ఆదేశించారు.
Next Story