Fri Dec 20 2024 12:43:40 GMT+0000 (Coordinated Universal Time)
Sankranti Updates : టాలీవుడ్ సంక్రాంతి అప్డేట్స్.. స్టార్స్ ఫెస్టివల్ ఫొటోలు..
సంక్రాంతి పండుగా సందర్భంగా టాలీవుడ్ సినిమాల నుంచి కొత్త అప్డేట్స్ వచ్చాయి.
Sankranti Updates : సంక్రాంతి పండుగా సందర్భంగా టాలీవుడ్ సినిమాల నుంచి కొత్త అప్డేట్స్ వచ్చాయి. చిరంజీవి నటించబోతున్న Mega156 టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు కాన్సెప్ట్ టీజర్ ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. నిమిషం పైగా ఉన్న ఆ టీజర్ లో గ్రాఫిక్స్ అదిరిపోయాయి. ఈసారి చిరంజీవి నుంచి భారీ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఆ టీజర్ వైపు ఓ లుక్ వేసేయండి.
ఇక రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు మారుతీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయకున్నా షూటింగ్ ని మాత్రం సైలెంట్ గా జరుపుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. ఇక నేడు పండుగా సందర్భంగా ఈ సినిమాని అధికారికంగా అనౌన్స్ చేస్తూ.. మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఆ సినిమా అప్డేట్ తో పాటు పండుగా రోజు మూవీ స్టార్స్ ఫెస్టివల్ స్పెషల్ ఫొటోలు వైపు కూడా ఓ లుక్ వేసేయండి..
Next Story